Take a fresh look at your lifestyle.

మూడ్రోజులపాటు భారీ వర్షాలు

‌రాష్ట్రంలో రాగల మూడు రోజులకు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వాతావరణ సూచన చేసింది. . రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. చెరువులు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.

Leave a Reply