Take a fresh look at your lifestyle.

రిజర్వాయర్‌లో పడి ముగ్గురు బాలలు మృతి

వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా భీమారంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని బీమారంలో గల పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పడి గురువారం ముగ్గురు బాలలు  గల్లంతయ్యారు. స్థానిక కెయుసి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పిల్లలు గల్లంతు కావటంలో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మృతదేహాలను వెలికి తీశారు.

మనివిత్‌, ‌మహేష్‌ ‌బాబు మృతదేహాలు బయటికి తీయగా మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్‌(11), ‌దొడ్డిపాటి మహేష్‌ ‌బాబు(14), మ్యూనికుంట్ల విష్ణుతేజ (14) ముగ్గురు బాలురు సైకిల్‌ ‌తొక్కుతూ వచ్చి ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌ ‌లో పడి మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

Leave a Reply