Take a fresh look at your lifestyle.

ఎపిలో మూడు రాజధానుల బిల్లు వాపస్‌

అసెంబ్లీలో సిఎం జగన్‌ ‌కీలక ప్రకటన
సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లుతో మళ్లీ సభముందుకు వొస్తామని వెల్లడి

ఏపీ రాజధానిపై సీఎం వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. ఏ ఉద్దేశ్యంతో మూడు రాజధానులు ప్రతిపాదించామో..అది నెరరవేర్చకుండా అడ్డుకుంటూ, అపోహలు సృష్టించడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నామని ఆయన అన్నారు. అయితే తమ ఆలోచనలకు అనుగుణంగా రాజధానుల బిల్లును మెరుగుపరిచి మళ్లీ సభముందుకు వొస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు. చంద్రబాబు తెలిపిన లెక్కల ప్రకారం అమరావతి మౌలిక వసతుల కల్పనతదితర నిర్మాణానికి లక్షకోట్లు కావాలని.

అది సాధ్యమా అని ప్రశ్నించారు. అభివృద్ది చెందిన విశాఖను కొంత మెరుగు పరిచి ఉంటే మంచి రాజధాని అయ్యేదన్నారు. కనీస వసతుల కల్పనకు అంత డబ్బులేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే గతంలో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ ‌క్యాపిటల్‌గా చేశామని, రాజధానిపై తమ నిర్ణయాన్ని ఈ రెండేళ్లలో రకరకాలుగా వక్రీకరించారని, తాము వికేంద్రీకరణ సరైన మార్గమని నమ్మి చర్యలు చేపట్టామని, అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పటికీ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేవని, సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వొస్తామని, అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా బిల్లు పెడతామని సీఎం జగన్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply