Take a fresh look at your lifestyle.

చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి అరెస్టు

 ‌సమావేశంలో మాట్లాడుతున్న రామగుండం సీపీ సత్యనారాయణ, పులి చర్మంను పరిశీలిస్తున్న సీపీ, అడిషనల్‌ ‌డీసీపీలు

చిరుత పులి చర్మం కేసులో ముగ్గురి నిందితులను రామగుండం పోలీస్‌ ‌కమీషనరేట్‌ ‌పరిధిలోని టాస్క్‌ఫోర్స్ ‌పోలీసులు పట్టుకున్నారు.ఈ సంధర్బంగా బుధవారం రామగుండం పోలీస్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ఆవరణ లో రామగండం సీపీ సత్యనారాయణ విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొడగండ్ల తిరుపతి, సదిమిక్‌ ‌గంగారాం, వెలది తులసీరాం మహారాష్ట్రకు చెందిన ముగ్గురు చిరుత చర్మంను మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో అమ్మడానికి రాగా పక్కా సమాచారంతో ఆ నిందితులు ను పట్టుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాకు ఆనుకుని ఉన్న ప్రాణహిత నది ఆవల ఉన్న మహారాష్ట్ర సిర్వంచ పరిధిలో కొన్ని రోజులుగా చిరుత పులి తిరుతున్నదనే సమాచారంతో నిందితులు చిరుత పులిని చంపి ఆ చర్మంను అమ్ముకోవడానికి పథకం వేసినట్లు తెలిపారు.

గతంలో వ్యవసాయ కూలి పనులు, అడవి జంతువులు కరెంటు షాక్‌ ‌పెట్టి చంపి అమ్ముకునే అలవాటు ఉన్నవారు పులి చర్మంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే దురాశతోనే ఈ సంఘటనకు పాల్పడినట్లు వివరించా రు. వన్యప్రాణులు వేటగాళ్ళ బారి నుండి వేటకు గురి కాకుండా అడ్డుకట్ట వేయడానికి అటవీ సంపదను సంరక్షించడానికి పోలీస్‌ ‌శాఖ అటవీ శాఖ అధికారుల సమన్వయంతో కలిసి పనిచేయడం జరుగుతున్నట్లు ఈ సంధర్భంగా తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ ‌డీసీపీ అడ్మిన్‌ ఎన్‌. అశోక్‌కుమార్‌, అడిషనల్‌ ‌డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ ‌రవికుమార్‌, ‌మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ ‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ‌సీఐ రాజ్‌కుమార్‌, ‌కిరణ్‌, ఎస్సై మస్తాన్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy