- రాష్ట్రంలో రోడ్లు బాగుపడలేదు
- ధాన్యం కొనబోమన్న మంత్రి వ్యాఖ్యలపై మండిపాటు
- నాలుగో రోజు కొనసాగిన రేవంత్ పాదయాత్ర
గద్దెనెక్కిన తర్వాత సీఎం కేసీఆర్ పదమూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేసినా..గ్రామాల్లో సరిగా రోడ్లు లేవని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. నాల్గోరోజు పాదయాత్రలో మాట్లాడిన రేవంత్.. కొండారెడ్డి పల్లి నుండి తిమ్మరాసిపల్లి వి•దుగా కల్వకుర్తికి టూవీలర్ పై వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అవసరమైతే దేవుడితో కొట్లాడుతా అన్న కేసీఆర్.. మోడీ తెస్తున్న చట్టాలపై ఎందుకు మాట్లాడట్లేదన్నారు. ‘వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పంట కోనబోమంటున్నారు..నీ అయ్యా జాగీరా పంట ఎందుకు కొనరు’ అని ప్రశ్నించారు రేవంత్.
రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టారన్నారు మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి. కల్వకుర్తి రైతుల బాధలు చెబుతున్నారన్నారు. తిమ్మరాసి పల్లిలో పూర్తిగా రైతులే ఉన్నారని.. రైతు సమస్యలు పోయే వరకు రైతు పోరాటాలు కొనసాగుతాయన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగోరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. అయితే నాలుగోరోజు పాదయాత్ర మొదలుకావడానికి ముందు ఆయనను ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిశారు.
ఆయనకు సీతక్క పెయిన్ రిలీఫ్ ఇచ్చే కొత్త చెప్పులను గిప్ట్గా ఇచ్చారు. వాటిని వేసుకొని చూసిన రేవంత్ రెడ్డి.. చెప్పులు బాగున్నాయన్నారు. కేంద్రం తెచ్చిన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రాజీవ్ రైతు భరోసా పాదయాత్రను మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.