Take a fresh look at your lifestyle.

రైతులను బెదిరించడం ఉపసంహరించుకోవాలి

ఆల్ పార్టీ మీటింగ్ లో పలు పార్టీల నేతలు
చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వమనడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇది బెదిరింపు ధోరణి ప్రకటన అని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే కల్పించే జిఒ 3ను రద్దు చేస్తూ సుప్రీం కోర్డు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఈలోగా దానిని కొనసాగిస్తూ తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరాయి. పోతిరెడ్డిపాడు సామర్థం పెంచుతూ ఎపి ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించాయి. హైదరాబాద్ మగ్దూంభవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎఐసిసి కార్యదర్శిఎస్.ఎ.సంపత్ టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ టిడిపి సీనియర్ నాయకులు పి.సాయిబాబా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్, హైకోర్టు న్యాయవాది వసుధలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఒ 3 రద్దు, రైతు బంధు, పోతిరెడ్డిపాడు, కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు

వ్యవసాయంలో రాజకీయ జోక్యం?: ప్రొ .కోదండరామ్

Threatening farmers should chooserawn
చెప్పిన పంట వేయకపోతే రైతుబంధు ఇవ్వమనే బెదిరింపు ప్రకటన సరైంది కాదని, ఇది రాజకీయ జోక్యానికి, వివక్షతకు దారి తీస్తుందని కోదండరామ్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు, మీడియాకు పరిమితమైన బెదిరింపులు ఇప్పుడు రైతుల దాకా వచ్చాయన్నారు. రైతులకు సూచన చేయాలని, వారు పండించే పంటలకు మార్కెటింగ్ కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. 70 శాతం మంది రైతులు డిమాండ్, రిస్క్, మార్కెటింగ్ వంటి అంశాలన్నీ ఆలోచించే పంటలు వేస్తారని తెలిపారు. గతంలో పత్తి వద్దని ప్రభుత్వం చెప్పడంతో అందరూ మిర్చీ వేశారని, దీంతో పత్తి ధర పెరిగి, మిర్చికి రాలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణి, కర్రపెత్తనంతో కాకుండా, సమగ్ర వ్యవసాయ విధానం ప్రకటించి అందరినీ ఒప్పించాలన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కిమ్మనడం లేదని కోదండరామ్ నిలదీశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఉదృత ఉద్యమాలు చేస్తామన్నారు. జిఒ 3కు చారిత్రక నేపథ్యం ఉన్నదని, సుప్రీం కోర్టు కొట్టేయడంతో జిఒ జారీ అంశంలో నాడు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ ఉన్న ఇ.ఎ.ఎస్.శర్మతో మాట్లాడామని, తక్షణమే ఆర్డినెన్స్ తీసుకరావాలని ఆయన సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!