Take a fresh look at your lifestyle.

‌ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు

threat to environment,plastics,Types of Cancerనిత్యజీవి తంలో అతి గా ప్లాస్టిక్‌ ఉపయోగంతో పర్యావరణానికి ముప్పు పొంచివుందని ప్లాస్టిక్‌ ‌వాడకం మనుషుల్లో కొన్ని రకాల క్యాన్సర్‌ ‌వ్యాధులకు కారణం అవుతుందని విచ్చలవిడిగా వాడి పడేస్తున్నా పాలిథిన్‌ ‌కవర్లను వీధు ల్లో ఇళ్ళ మధ్య పరిసరాల ప్రాంతాల్లో బహిరంగంగా ప్లాస్టిక్‌ ‌కవర్లలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది కుక్కలు పందులు అందులో దొర్లడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ప్లాస్టిక్‌ ‌భూమిలో కరగడానికి వందల సంవత్సరాల సమయం పడుతుంది అని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వినియోగం మాత్రం ఆగడం లేదు. చెత్త చెదారన్నీ నిప్పు పెట్టడంతో దానినుండి వెలువడే పొగ పర్యావరణం, వాతావరణం కలుషితమై శ్వాస హృద్రోగ సంబంధ వ్యాధులకు కారణమవుతు న్నాయని మానవులతో పాటు పక్షులు, జల జీవాలు, జంతువులకు ముప్పుగానే పరిణమిస్తుందని హెచ్చరికలు ఉన్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ ‌వినియోగంపై  కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ పాలకులు అధికారులు కఠిన చట్టాలను కేంద్ర స్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని సామాజిక ఉద్యమకారులు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు అధికారులు వెంటనే స్పందించి పర్యావరణానికి హాని చేస్తే ప్లాస్టిక్‌ ‌కవర్ల తయారీ వినియోగం అమ్మకాలు రవాణా నిషేధించాలని కోరుతున్నారు. పర్యావరణ ప్రమాదం ఉందని ప్రకృతి సంపద ఆందోళనకు గురి చేస్తోందని ప్లాస్టిక్‌ ‌వాడకం పెరిగిపోయిందని పరిశ్రమల ద్వారాకాలుష్యాన్ని వెదజల్లుతూన్నాయి. అడవులను నరకటం తో  పర్యావరణానికి ముప్పు తెచ్చి పెడుతుందని దీని ప్రభావంతో రానున్న పదేళ్లలో పరిస్థితులు మరింత భయానకంగా ఉండబోతున్న కేంద్ర పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

Tags: threat to environment,plastics,Types of Cancer

Leave a Reply