Take a fresh look at your lifestyle.

నేటి నుంచి సిద్ధిపేటలో టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్స్

‌ప్రారంభించనున్న ఎంపి కేపీఆర్‌, ‌ప్రజాప్రతినిధులు
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో మరికొన్ని గంటల్లో మరో క్రికెట్‌ ‌సంబురం కానున్నది. గత ఫిబ్రవరి నెలలో సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్స్ ‌జరగగా…ఆదివారం నుంచి టిహెచ్‌ఆర్‌(‌తన్నీరు హరీష్‌రావు)సిద్ధిపేట రూరల్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్స్ ‌ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంట్స్ ‌ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి (కేపీఆర్‌), ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి హాజరు కానున్నట్లు ట్రోఫీ నిర్వహకులు మచ్చ వేణుగోపాల్‌ ‌రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్‌ ‌తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సిద్ధిపేటలో విలేఖర్లతో మాట్లాడుతూ ట్రోఫీ వివరాలను వెల్లడించారు. గత ఫిబ్రవరి నెలలో నిర్వహించిన కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ స్పూర్తితో ఈ నెల 14నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గానూ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సిద్ధిపేటలో టిహెచ్‌ఆర్‌ ‌సిద్ధిపేట రూరల్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ•ని నిర్వహిస్తున్నామన్నారు.

టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీకి గ్రామీణ ప్రాంతంలోని యువత నుండి అనూహ్య స్పందన వచ్చిందనీ, యువత స్పందన, ఉత్సహం చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. యువ క్రీడాకారులలో క్రీడాస్పూర్తిని పెంపొందించే విధంగా మంత్రి హరీష్‌రావు క్రీడలను ప్రోత్సహిస్తున్నారనీ దీనిలో భాగంగానే ఇటీవల కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీని ఘనంగా నిర్వహించామనీ గుర్తు చేస్తూ… అదే స్పూర్తితో సిద్దిపేట నియోజకవర్గ రూరల్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుని…టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నదే ఈ క్రికెట్‌ ‌టోర్నమెంట్‌ ‌ముఖ్య లక్ష్యమన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయనీ, గ్రామీణ ప్రాంత యువత క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇది ఒక మంచి వేదిక కానుందన్నారు. ఈ ట్రోఫీలో మొత్తంగా 96టీమ్స్ ‌వచ్చాయనీ 1440మంది యువ క్రీడాకారులతో టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌సంబురం సిద్ధిపేటలో మొదలు కానున్నదన్నారు. ఆదివారం ప్రారంభ వేడుకల్లో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని 5మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొంటారనీ టిహెచ్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లిఖార్జున్‌ ‌తెలిపారు.

Leave a Reply