Take a fresh look at your lifestyle.

కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల గోల్‌మాల్‌

  • ‌రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారు
  • వేలంలో పాల్గొనకుండా కొందరికి బెదిరింపులు
  • సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కేసులపై విచారణ చేయాలి
  • పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

కోకాపేట భూముల వేలంలో వెయ్యికోట్ల అక్రమాలు జరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌ అయిందని ఆరోపించారు. పారిశ్రామికవేత్త రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. రామేశ్వరరావు కంపెనీలకు కేసీఆర్‌ ‌వందలకోట్ల లబ్దిచేకూర్చారని దుయ్యబట్టారు. ఆయన కోసమే ఈ భూమలు వేలం జరిగనట్లుగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని, ఇలా కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని తెలిపారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే సిద్దిపేట కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి కూడా భూములు కొన్నారని అన్నారు. ఇకపోతే సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌పై రేవంత్‌ ‌రెడ్డి పలు ఆరోపణలు చేశారు. సోమేశ్‌ ‌కుమార్‌ ఏపీ కేడర్‌ ‌వ్యక్తి అని చెప్పారు. సోమేశ్‌ ఏపీకి వెళ్లాలని క్యాట్‌ ‌తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్‌ ‌సీఎస్‌గా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్‌ ‌సెక్రటరీపై 298 కంటెప్ట్ ఆఫ్‌ ‌కోర్టు కేసులున్నాయి.

ఏపీకి కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు సర్వీస్‌ ‌వొదిలేసి ప్రైవేటు కంపెనీల్లో పని చేశాడని రేవంత్‌ అన్నారు. ఆ 8 సంవత్సరాలను సర్వీస్‌లో తొలగిస్తే ఆయనకు ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ హోదా ఇవ్వడానికి కూడా చట్టం అనుమతించదన్నారు. అలాంటి సోమేశ్‌ ‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీని చేశాడు. అలా సోమేశ్‌ ‌కుమార్‌ ‌కెసిఆర్‌ ‌చెప్పిన పనికల్లా తలొగ్గుతూ అడ్డగోలుగా సంతకాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సోమేశ్‌ ‌కుమార్‌ను ఏపీకి కేటాయించిన ఆఫీసర్‌. ‌తెలంగాణలో తనను ఉంచాలని సోమేశ్‌ ‌క్యాట్‌కు వెళ్లారు. అయితే సోమేశ్‌ అభ్యర్థనను క్యాట్‌ ‌కొట్టిసింది. అంతేకాదు ఏపీకి వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సోమేశ్‌ ‌కుమార్‌ ‌హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నాలుగు సంవత్సరాలు అయింది. స్టేకు సంబంధించిన కేసు ఇప్పటివరకూ కోర్టు బెంచ్‌ ‌వి•దకు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సోమేశ్‌ ‌కుమార్‌పై అడిషిన్‌ ‌సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌కోర్టులో మెన్షన్‌ ‌చేయాలి. ఇప్పటివరకూ మెన్షన్‌ ‌చేయలేదు. రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఇకపోతే ఆయనకు సంబంధించిన కేసుల ఫైళ్లు కూడ మాయమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply