Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌భావజాలాన్ని అమలు చేసే వారే గాంధీభవన్‌లో ఉంటారు

  • టిఆర్‌ఎస్‌, ‌బిజెపి అభ్యర్థులిద్దరూ దోచుకున్నవారే
  • అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు
  • సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క

మీరు బిజెపితో కుమ్మక్కయి మా పార్టీపై విమర్శలా..? : కెటిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి
గాంధీభవన్‌లో గాడ్సే దూరిండన్న టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఫైర్‌ అయ్యారు. గాంధీ భవన్‌లో గాడ్సేలు ఉన్నారని ఆయన ఎలా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెస్‌ ‌భావజాలాన్ని అమలు చేసే వ్యక్తులు మాత్రమే గాంధీ భవన్‌లో ఉంటారని భట్టి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ ‌వద్ద ఆయన శనివారం మాట్లాడుతూ..హుజురాబాద్‌ ‌ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించాలని చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని భట్టి అన్నారు.

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడుగా వెంకట్‌ ‌చాలా ఏళ్లుగా విద్యార్థి, యువత కోసం గట్టిగా పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి పోరాటాలు చేసే అభ్యర్థిని శాసనసభకు పంపించాలని హుజూరాబాద్‌ ‌ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు. అసలు ఈ ఉప ఎన్నిక వొచ్చింది ఎన్నికల కమిషన్‌ ఎన్నికను రద్దు చేయడం వల్లనో, లేక దురదృష్టకర ఘటన వల్లనో రాలేదని, కేవలం ఏడేళ్లు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ ‌విపరీతమైన అవినీతికి పాల్పడ్డాడని పదవినుంచి తొలిగిస్తున్నట్లు కేసీఆర్‌ ‌చెప్పారు.

అంతేకాక ఆయన మీద విచారణ జరుగుతున్నదని భట్టి అన్నారు. అయితే అవినీతి చేసింది తానొక్కడినే కాదని, స్కూటర్‌ ‌మీద వొచ్చిన టీఆర్‌ఎస్‌ ‌నాయకులు లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయాన్ని దోచుకున్నారని రాజేందర్‌ అం‌టున్నారని, దోపిడీ దొంగలు ఒకరు బీజేపీ నుంచి మరొకరు టీఆర్‌ఎస్‌ ‌నుంచి పోటీ చేస్తున్నారని, హుజూరాబాద్‌ ‌ప్రజలు ఈ దోపిడి దొంగలను ఆపాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థికి వోటేయాలని ఆలోచన చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు.

మీరు బిజెపితో కుమ్మక్కయి మా పార్టీపై విమర్శలా..? : కెటిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి
గాంధీభవన్‌లో గాడ్సే దూరిండని మంత్రి కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలను పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలో తమ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌, ‌కేటిఆర్‌లు గాడ్సేల్లాగా పాలిస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీతో కేసీఆర్‌ ‌కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే మొన్న రెండు సార్లు ఢిల్లీకి పోయి మోదీ కాళ్ళు మొక్కి వొచ్చారన్నారు. నోట్ల రద్దు నుంచి 370 ఆర్టికల్‌ ‌రద్దు వరకు అనేక అంశాలలో బీజేపీకి మద్దతు ఇచ్చింది టీఆర్‌ఎస్‌ అని తెలిపారు.

రైతులకు ఉరి తాళ్లుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయమంటే పారిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. రేవంత్‌ ‌రెడ్డిని, కాంగ్రెస్‌ ‌పార్టీని చూస్తే కేటీఆర్‌కు, కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతుందని మల్లు రవి అన్నారు.

Leave a Reply