Take a fresh look at your lifestyle.

ఈసారి ఖైరతాబాద్‌ ‌వినాయకుడి ఎత్తు 12 అడుగులే

కోవిడ్‌ ‌కారణంగా కనిపించని ఉత్సవాల సందడి

 తెలంగాణలో వినాయక చవితి పండుగ అనగానే ముందుగా ఖైరతాబాద్‌ ‌వినాయకుడే గుర్తుకు వస్తాడు. ఈసారి కూడా ఖైరతాబాద్‌ ‌వినాయకుడు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాడు. అయితే భారీ గణపతి బదులు పరిమితంగా 12 అడుగుల గణపతిని ప్రతిష్టిస్తున్నారు. ఏటా హైదరాబాద్‌లో ఎటు చూసినా వినాయకచవితి సందడే కనిపించేది. వినాయకచవితి అంటేనే బోలెడంత జోష్‌ ఉం‌డేది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. గల్లీ గల్లీలోనూ ఎక్కడ చూసినా గణపయ్య పేరే వినిపించేది. కానీ కొరోనా కారణంగా ఆ సందడి లేకుండా పోయింది.
బొజ్జ గణపయ్య పూజలకు ఘనంగా బదులు మామూలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వినాయకచవితి పండగ ప్రత్యేకతే వేరు. విగ్రహం ప్రతిష్టాపన దగ్గర నుంచీ నిమజ్జనం వరకూ అంతా భక్తి భావంతో ఉప్పొంగిపోతారు. ఘనంగా జరుపుకునేందుకు ఆరాటపడతారు. తమకు తోచిన విధంగా విగ్రహాలు ప్రతిష్టించేందుకు ఆసక్తి చూపిస్తారు. రెండు, మూడు వారాల క్రితం నుంచే వినాయకచవితి ఉత్సవాల కోసం ఏర్పాట్లు మొదలెడతారు. ఈసారి కూడా గణెష్‌ ‌పండుగ కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నా…బహిరంగంగా చేయడానికి ఆంక్షలు అడ్డం వచ్చాయి. ముఖ్యంగా ఖైరతాబాద్‌ ‌గణెష్‌ ‌ప్రత్యేకాకర్శణ. ప్రతి ఏడాది విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చే ఖైరతాబాద్‌ ‌గణపతి ఈసారి చిన్నబోయాడు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!