Take a fresh look at your lifestyle.

ఓ వీరుడా నిను మరవదు ఈ తెలంగాణ

“నిజామ్ ను లేపేద్దాం అన్న నారాయణ రావు పవార్ నోటి నుండి వచ్చిన మాటకు ఆయన స్నేహితులు అవును .. లేపాయలని మద్దతు పలికారు. అప్పటికే ఆర్యసమాజ్‌కు చెందిన పండిట్ రుద్రదేవ్, పండిట్ నరెంద్రజీల స్ఫూర్తి నారాయణ రావు సంకల్పానికి తోడ్పడింది. ఆర్య యువక్రాంత్ అనే దళాన్ని ఏర్పాటు చేశాడు. పవార్‌‌తోపాటు పండిట్ విశ్వనాధ్, రెడ్డి పోచనాధం, జి నారాయణ స్వామి, బాలకిషన్, గండయ్యా అలియాస్ గంగారాం, జగదీశ్ ఆర్య తదితరులు నిజామ్ ను లేపెయ్యాలన్నధృడ సంకల్పంతో పథకాన్ని రూపొందించారు.దాడికి అవసరమయ్యే బాంబులు సమకూర్చుకునేందుకు బొంబాయి వెళుతూ మార్గ మద్యలో షోలాపూర్ లో కొండ లక్ష్మణ్ బాపు ఉన్నాడని అతని సహాయం కోరుతూ అతన్ని కలిసారు. అయితే నిజామ్ ను లేపేస్తామని చెబితే కొండా లక్ష్మణ్ బాపూజి ఎట్లా స్పందిస్తారో తెలియక తెలంగాణ లో రజాకార్ల ఆగడాలు బాగా మితిమీరి పోయాయని వారు సాగించే హింసాకాండకు చరమ గీతం పాడాలని బాంబుల కోసం బొంబాయి వెళుతున్నామని చెప్పాడు. అయితే కొండా లక్మణ్ బాపు వారు చెప్పిన మాటలు పూర్తి కాకుండానే రజాకార్లేమిటి ఏకంగా నిజామ్ నే లేపేస్తే సరి అనడంతో ఆశ్యర్య పోతారు.”

నేడు తెలంగాణ భగత్ సింగ్ నారాయణ రావు పవార్ జయంతి

బానిస దాస్య శృంఖలాలు తెగి పోయిన దినం 1947 ఆగస్ట్ 15 న దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటే దక్కన్ పీఠభూమి లోని నిజామ్ సంస్థానంలోని తెలంగాణ ప్రజలకు మాత్రం కారు చీకట్లు తొలిగి పోలేదు. నిజామ్ నవాబు కిరాయి మూకలైన రజాకార్ల ఆగడాలు మితి మీరి పోయి తెలంగాణ ప్రజలు పిడికిళ్ళు బిగించి విముక్తి బాట పట్టిన రోజులు అవి.ఎక్కడి కక్కడ నిజామ్ నవాబుకు, రజాకార్లకు, దేశ్ ముఖ్ లకు జాగీర్ దార్లకు వ్యతిరేకంగా సాంప్రదాయ పనిముట్లు చెప్పులు, చీపుర్లు,బడితెలు, కొడవండ్లు, గొడ్డండ్లను ఆయుధాలుగా చేసుకుని ఆడ మగ తిరగబడి రజాకార్లను తరిమి కొట్టిన సమయంలో ఓ నలుగురు నవయవకులు ఏకంగా నిజామ్ నవాబునే లేపేసి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలని సంకల్పించారు.

పక్కా ప్రణాళికతో జరిగిన బాంబు దాడిలో నిజామ్ నవాబు వెంట్రుక వాసిలో బతికి పోయాడు. మరో బాంబు విసిరే అవకాశం ఇవ్వక జవాన్లు చుట్టిముట్టి బాంబు విసిరిన యువకున్ని పట్టుకుని కదలకుండా బందించారు. అతనితో పాటు మరో యువకుడు కూడ జవాన్లకు దొరికాడు. బాంబు దాడిలో ఓ చిన్నారి మృతి చెందగా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఈ దాడిలో నిజామ్ కనుక చనిపోయి ఉంటే దక్కన్ పీఠభూమిలో తెలంగాణ గడ్డ చరిత్ర మరో విదంగా లిఖించ బడేది. బాంబు దాడి చేసిన ఆ యువకుడు ఎవరో కాదు. వరంగల్ ముద్దు బిడ్డ నారాయణ రావు పవార్. నారాయణ రావు పవార్ ధైర్య సాహసాలు చూసి అతన్ని తెలంగాణ భగత్ సింగ్ గా పిలుచు కునేవారు.

Kuna Mahender Senior Journalist

నారాయణ రావు పవార్ 2010 డిసెంబర్ 12 వరకు జీవించాడు. 1925 లో అక్టోబర్ 3 న తెలంగాణ భగత్ సింగ్ నారాయణరావు పవార్ జన్మించాడు.నారాయణరావు పవార్ తండ్రి పండరినాధ్‌ది కర్ణాటకలోని బీదర్‌జిల్లా బాల్కీ, తాలూకా, దేబ్కీ గ్రామం. వర్షాలు లేక బీదర్ లో తీవ్రమైన కరువు నెలకొనగా పండరి నాధ్ వరంగల్ కు వలస వచ్చి రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజులు గుట్ట కింది వీధిలో నివసిస్తూ రైల్వే స్టేషన్ లో దినసరి కూలీగా పనిచేసాడు.నారాయణ రావు నాలుగవ ఏట ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి మరో పెండ్లి చేసుకోలేదు.నారాయణరావు ఇంటర్ చదువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లి అది పూర్తి ఏయిన తర్వాత పై చదువులకు డబ్బులు లేక కొంత కాలం రేషనింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశాడు. ఆతర్వాత హైకోర్టులో వకాల్తా కోర్సులో చేరాడు. హైకోర్టుకు వెళ్తు వస్తున్న క్రమంలో ఆయనకు పలు మార్లు నిజామ్ నవాబు కాన్వాయ్ భారి బందోబస్తుమద్య ప్రధాన రహదారుల గుండా వెళ్ళడం చూశాడు. ఆయన కన్వాయ్ వెళ్ళినపుడల్లా ట్రాఫిక్ నిలిపి వేయడం జరుగుతుండేది.దాంతో విసుగు చెందిన నారాయణ రావు పవార్ ఓ రోజు వీణ్ణి చంపేస్తే పీడ విరగడయ్యేది తెలంగాణకు… అని తన స్నేహితుడుతో అన్నాడు. అప్పటికే రజాకార్ల దురాగాతాలతో తెలంగాణ తల్ల డిల్లు తోంది. గ్రామాలను తగల బెట్టడం సామూహికంగా హత్యలు చేయడం వంటి రజాకార్ల మారణ కాండతో అట్టుడుకుతున్న తెలంగాణాలో జనం రజాకార్లపై తిరగబడుతూ తరిమి కొడుతున్నారు.

Kuna Mahender Senior Journalist

నిజామ్ ను లేపేద్దాం అన్న నారాయణ రావు పవార్ నోటి నుండి వచ్చిన మాటకు ఆయన స్నేహితులు అవును .. లేపాయలని మద్దతు పలికారు. అప్పటికే ఆర్యసమాజ్‌కు చెందిన పండిట్ రుద్రదేవ్, పండిట్ నరెంద్రజీల స్ఫూర్తి నారాయణ రావు సంకల్పానికి తోడ్పడింది. ఆర్య యువక్రాంత్ అనే దళాన్ని ఏర్పాటు చేశాడు. పవార్‌‌తోపాటు పండిట్ విశ్వనాధ్, రెడ్డి పోచనాధం, జి నారాయణ స్వామి, బాలకిషన్, గండయ్యా అలియాస్ గంగారాం, జగదీశ్ ఆర్య తదితరులు నిజామ్ ను లేపెయ్యాలన్నధృడ సంకల్పంతో పథకాన్ని రూపొందించారు. దాడికి అవసరమయ్యే బాంబులు సమకూర్చుకునేందుకు బొంబాయి వెళుతూ మార్గ మద్యలో షోలాపూర్ లో కొండ లక్ష్మణ్ బాపు ఉన్నాడని అతని సహాయం కోరుతూ అతన్ని కలిసారు. అయితే నిజామ్ ను లేపేస్తామని చెబితే కొండా లక్ష్మణ్ బాపూజి ఎట్లా స్పందిస్తారో తెలియక తెలంగాణ లో రజాకార్ల ఆగడాలు బాగా మితిమీరి పోయాయని వారు సాగించే హింసాకాండకు చరమ గీతం పాడాలని బాంబుల కోసం బొంబాయి వెళుతున్నామని చెప్పాడు. అయితే కొండా లక్మణ్ బాపు వారు చెప్పిన మాటలు పూర్తి కాకుండానే రజాకార్లేమిటి ఏకంగా నిజామ్ నే లేపేస్తే సరి అనడంతో ఆశ్యర్య పోతారు.

కొండా లక్మణ్ బాఫూజి వీరికి సూచనలు సలహాలు ఇవ్వడమే కాక బాంబులు కొనేందుకు వారికి 600 రూపాయలు కూడ ఇస్తాడు. వాటితో వారు బౌంబాయికి వెళ్లి అక్కడ ఒక బాంబుల వ్యాపారం చేసే ఓ గుజరాతి బ్రాహ్మణుడి నుండి రూ 12 కు ఒకటి చొప్పున శక్తివంతమైన రెండు పిన్ బాంబులు కొనుగోలు చేస్తారు.అతర్వాత వాటిని తీసుకుని తిరిగి షోలాపూర్ కు వెళ్ళి బాపూజీని కలుస్తారు. అక్కడే నిజాం నవాబు పై దాడికి పథక రచన చేస్తారు. కొండా లక్మణ్ బాపు సహకారంతో మూడు పిస్టళ్లు సమకూర్చుకుంటారు. ఒక వేళ దాడి పథకం విఫలం అయితే నిజామ్ జవాన్లకు దొరకకుండా విషం సేవించి తాగాలని విషం బాటిళ్ళు కూడ సమకూర్చుకుంటారు.మరణ వాగ్మూలం వంటి ప్రతిజ్ఞను తమ రక్తంతో ఓ కాయితంపై రాసుకుని ముగ్గురూ కల్సి ఫోటో దిగుతారు. దాడి అనంతరం ఆ ఫోటోను వారి ప్రతిజ్ఞ లేఖను నారాయణ స్వామి విజయవాడకు తీసుకు వెళ్ళి పత్రికలకు ఇవ్వాలి.వారి దాడి పథక ఏంటంటే నిజామ్ రాజు కారుకు ఎదురుగా వెళ్ళి బాంబు విసరాలి. ఒక దగ్గర బాంబు దాడి విఫలం అయితే రెండో చోట బాంబు విసిరి అనంతరం కాల్పులు జరపాలనేది వారి ప్లాన్.జగెదీశ ఆర్య, మధ్యన నారాయణ రావు పవార్ తర్వాత కొద్దిదూరం‌లో గండయ్య బాంబు, పిస్తోలు, విషంసీసాతొ నిల్చున్నారు. పవార్ బాంబు తప్పి ముందుకువెళితే గండయ్య, వెనక్కి వెళితే జగదీశ్ ఆర్య దాడిచేయాలి.

డిసెంబర్ 4 శుక్రవారం 1947 సాయంత్రం 4-5 గం.ల మధ్య నిజామ్ నవాబు తన నివాసమైన కింగ్ కోఠీ పాలెస్ నుండి దార్ ఉల్ షిఫాలోని తల్లి సమాధి వద్దకు బయలు దేరుతాడు. ఒక సందు గుండా హఠాత్తుగా నిజామ్ నవాబు కారుకు ఎదురుగా వచ్చిన నారాయణ పవార్ బాంబు విసురుతాడు. అది గురి తప్పి నేరుగా కారు ముందు భాగాన పడి పేలుతుంది. బాంబు గురి తప్పడంతో నిజామ్ నవాబు ప్రాణాలతో బయట పడతాడు. ఈ దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. మరో ముగ్గురు పౌరులు గాయపడతారు. దాడి అనంతరం బాంబు శబ్దం విన్న రెండో చోట మాటు వేసిన వారు దాడి సక్సెస్ అయిందని అక్కడి నుండి వెళ్లి పోతారు. నారాయణ రావు పవార్, గండయ్య ఇద్దరిని నిజామ్ జవాన్లు పట్టుకుని చితక బాదుతారు. నారాయణ రావు పవార్ దవడ పండ్లు ఊడి పోయేలా కొడతారు. అయితే ఈ గందరగోళంలో కొంత దూరం వెళ్ళి ఆగిన నిజామ్ నవాబు తిరిగి వెనక్కి వచ్చి వారిని హింసించ వద్దని చట్ట రీత్యా శిక్షించాలని ఆదేశిస్తాడు. దాడి ఎందుకు చేశారో ఎవరు చేయించారో చెప్పాలంటూ పవార్ ను, గండయ్యను ఆ తర్వాత కూడ తీవ్ర చిత్ర హింసల పాలు చేస్తారు. వారి చేతిలో నారాయణ రావు పవార్ ఎలాంటి దెబ్బలు తిన్నాడో వివరిస్తు ఆ దెబ్బలు తనకు జీవితాంతం భాదిస్తున్నాయని ఆయన్ని కల్సిన వారితో చెబుతుండే వాడు.

కోర్టు నారాయణ పవార్ కు, గండయ్యకు మరణ శిక్ష విధిస్తుంది. అయితే నిజామ్ నవాబుకు అప్పటికే తెలంగాణ లో జరిగిన పరిణామాలతో తన సంస్థానం మన గలగడం అనుమానమేనని తెలంగాణ ప్రజల తిరుగు బాట్లు మరో వైపు ఇండియన్ యూనియన్ సైనిక చర్య తదితర వత్తిళ్ల తో శిక్షలు అమలు చేయలేదని చెబుతారు. కోర్టు విధించిన మరణ శిక్ష తీర్పు పై అసలు నిజామ్ నవాబు సంతకం చేయలేదని ఆయన అప్పటి వరకు ఏ ఒక్క మరణ శిక్ష తీర్పుపై కూడ సంతకం చేయక పోవడం కూడ కారణమని చెబుతారు. దాంతో మరణ శిక్ష పడిన వారంతా అప్పటి వరకు జీవిత శిక్ష పడిన ఖైదీలుగా శిక్ష అనుభవించారని చెబుతారు.నారాయణ రావు పవార్ పోలీస్ యాక్షన్ అనంతరం 1949లో జైలునుండి విడుదలయ్యాడు.

పవార్ తన దాడి ఘటన పై ఆయనను కల్సిన సన్నిహితులతో ఎంతో భావోద్వేగంతో వివరించే వాడు. నేను కోర్టులో లాయర్ ను కూడ పెట్టు కోలేదు. నేనే నా కేసు వాదించుకున్నాను… నిజామ్ ను చంపమని ఎవరూ నన్ను ప్రోద్బలించ లేదు. రజాకార్లు సాగించిన హత్యాకాండ చూసి తెలంగాణ ప్రజల విముక్తి కోసమే నిజామ్ ను చంపాలనుకున్నానని కోర్టులో వాదించానని నారాయణ రావు పవార్ వివరించే వాడు.తెలంగాణ విముక్తి కోసం నిజామ్ నవాబుకు రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన యోధుల్లో నారాయణ పవార్ పేరు చిర స్థాయిగా నిలిచి పోతుంది.

(ఇందులో రావి చెట్టు రాజేశ్వర్ రావు 2017 లో రాసిన ఆయన ముఖపలకం లో నుండి నారాయణ రావుకు సంభందించిన వివరాలు పొందు పర్చడం జరిగింది.)

Kuna Mahender Senior Journalist
కూన మహేందర్
సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply