Take a fresh look at your lifestyle.

ఈ ‌పాపం పాలకులదే..!

వ్యాధి కన్నా వైద్య చికిత్స
గుండెల్లో గుబులు రేపుతోంది

వైరస్‌ ‌కన్నా ఏలికల పోకడ
ఎదల చీల్చి చెండాడుతుంది

ఆప్తులు పోయారన్న బాధ కన్నా
అంత్యక్రియల ఊహే వేధిస్తోంది

ఆసుపత్రి గడప తొక్కడమంటే
నరకంలోకి అడుగిడుతున్నంత
కలవరం రోగిని వెంటాడుతోంది

నాసిక్‌ ‌దవాఖానలో …
అక్షిజన్‌ ‌ట్యాన్క్ ‌లీకేజీ వల్ల
కోవిద్‌ ‌రోగుల మృత్యోదంతం
ఏలికల డొల్లతనం ఎత్తి చూపింది

ఇపుడు దేశంలో
పడకల లోటు పరిహసిస్తుంది
వెంటిలేటర్‌ ‌కొరత వెక్కిరిస్తోంది

నమూన సేకరణ కేంద్రాల వద్ద
రోజుల తరబడి బారుల తీరులు

డోసులకై రాష్ట్రాలు అర్తింపులు
ఉత్పత్తి పెంపుకు సంస్థల అర్జీలు
వెరసి  దేశం స్మశానానికి నెలవైంది

ఊకదంపుడు ముచ్చట్లతో …
రోగం నయం కాదన్నది చేదునిజం

నిషేధాజ్ఞలు , రాత్రి కర్ఫ్యూలతో…
కరోనా కట్టడి కాదన్నది నగ్నసత్యం

ఇకనైనా కేంద్ర పాలకులు
మరింత బాధ్యత ఎత్తుకుంటే …
దిద్దుబాటు చర్యకు ఉపక్రమిస్తే…
నిరంతరం ‘‘టీకా’’ సరఫరా చేస్తే…
కట్టడి క్రతువు యజ్ఞంలా సాగిస్తేనే …
కరోనా మహమ్మారి తోక ముడిచేది
దేశం ఆరోగ్య క్షేత్రంగా అవతరించేది

( ఆక్సిజన్‌ ‌లీకేజీ వల్ల బలైన అభాగ్యులకు అశ్రు నివాళి అర్పిస్తూ….)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply