దేశంలో రైతు నెత్తిన అప్పు
మోయలేని భారమైన కుప్ప
ఏడాదికి ఏడాది పెరిగే రుణం
బతుకంతా కష్టాలతో రణం
పంటకు కావట్లేదు గిట్టుబాటు
ఆర్థికంగా తట్టుకోలేక కుంగుబాటు
వ్యవసాయ కుటుంబాల్లో
58 శాతం రుణాల గుప్పెట్లో
అతలాకుతలం…. అన్నదాత
ఎలా భరించగలడు అప్పులమోత
రైతు దిగజారి అవుతున్నడు కూలి ఉపాధి లేక అవుతున్నది గ్రామం ఖాలీ
పాలకులకు పట్టదు రైతుల గోస!!
సర్కారుకు కార్పొరేట్ల పైనే ధ్యాస!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్ జర్నలిస్టు, ప్రజాతంత్ర