Take a fresh look at your lifestyle.

ఏ ‌నయా జమానా..!

రెక్కలొచ్చిన పక్షులు
ఏ గూటికైన చేరుకోవచ్చు
ఎటు దిక్కైన ఎగిరిపోవచ్చు

దూరమయ్యే వాటికి వేదనేందుకు
చేరువ కాలేరేమోనన్న యాతనేందుకు

దూర తీరాలకేగినా..
చెంతనే కదలాడినా..
ఆప్పటి ఆప్యాయతలు
ఇప్పుడుంటాయని ఆశించకు

ఎందుకంటే ?
కాలంతో పాటు …
కన్న బిడ్డలు మారుతున్నారు
వాళ్ళ రీతులు మారుతున్నాయి

మీ సుఖం కోసం తప్పా..!
మా కోసం కన్నారా? అని ప్రశ్నించే
దుర్గుణం గల వారసులున్న లోకం ఇది

ఏమిచ్చారని మీ సేవ చేయాలంటూ..?
చీత్కరించు నిర్దయ బిడ్డలున్న గడ్డ మనది

నువ్వు ఆకలి చంపుకొని
వాళ్ళ కడుపు నింపవచ్చు

కన్నీళ్లు దిగమింగి …
వాళ్ళ బాగోగులు చూడవచ్చు
కానీ అభి ఏ పూరా జాంతా నహీ..

కన్నోళ్ల రుణం కొంతైనా తీర్చవచ్చు గాక …
అదే తీరుగా ఆశించడమే కడు వ్యధ

పేగు బంధాలు …
రక్త సంబంధాలు..
శిథిలమైనవన్నది నిష్ఠూర సత్యం

మంచి, మానవత్త్వం…
మచ్చుకైనా కాన రావన్నది
ఎద తొలిచేసే పచ్చి నిజం

వయసుడిగి జీవత్సవమవకనే …
అనాదలా నడి రోడ్డున పడక ముందే
ఎదుటి గుణం తెలుసుకో..
నీ భద్రతనెరిగి మసలుకో…

దీపమున్నపుడే ఇల్లు చక్కదిద్దన్నట్లు
సత్తువ ఉన్నపుడే నాల్గు రాళ్లు వెనకేసుకో
– కోడిగూటి తిరుపతి, 9573929493

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply