Take a fresh look at your lifestyle.

కొరోనా బారిన పడకుండా… వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం అండ

ఈ సంజీవని పేరుతో ప్రత్యేక పథకం
దేశంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వయో వృద్ధులు వైరస్‌ ‌బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంజీవని ఓపిడి పేరుతో దవాఖానాకు పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి వైద్యుని ద్వారా సేవలు పొందే పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్‌ ‌మొదలైన జబ్బులు కలిగిన వృద్ధులు రెగ్యులర్‌గా తీసుకునే మందుల కోసం ఈ సమయంలో దవాఖానాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్లాలని అనుకున్నప్పటికీ బయట కొరోనా ప్రమాదం పొంచి ఉంది. తలనొప్పి, శరీర నొప్పి వంటి చిన్న సమస్యలకు దవాఖానాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వైద్య సేవలు పొందడానికి ఈ సంజీవని వీలు కల్పిస్తుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సంజీవని వెబ్‌సైట్‌ను రూపొందించింది.

దీనిని గూగుల్‌ ‌క్రోమ్‌ ‌ద్వారా చేరుకోవచ్చు.eSanjeevaniopd.in వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో సూచించిన విధంగా రోగుల పేరును నమోదు చేసుకుంటే సంబంధిత వ్యక్తి మొబైల్‌ ‌నంబరుకు ఓటీపీ వస్తుంది దాని ద్వారా రోగికి అవసరమైన వైద్య చికిత్సల వివరాలు, రాష్ట్రం, జిల్లా పేర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను నమోదు చేసిన వెంటనే సంబంధిత రోగి ఆన్‌లైన్‌ ‌ద్వారా వైద్యునితో కనెక్ట్ అవుతారు. వీడియో కాలింగ్‌ ‌పద్దతి ద్వారా రోగి ఆరోగ్య సమస్యలను వైద్యునికి వివరిస్తే ఆయన ఆన్‌లైన్‌లోనే మందులు సూచిస్తారు. ఆయన సూచించిన మందులను మెడికల్‌ ‌షాపులో చూపించడం ద్వారా అవసరమైన మందులను పొందవచ్చు. ఈ పద్దతి పూర్తిగా ఉచితం అయితే, ఆదివారం సహా ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్మాహ్నం 3 వరకు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ సంజీవని విధానం ద్వారా వయోవృద్ధులకు వైద్య సేవలు అందించడానికి దేశవ్యాప్తంగా 77 మంది నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఒకవేళ వయోవృద్ధులు ఈ సంజీవని ద్వారా ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోదలిస్తే అందుకు వీలుగా 91- 11- 23978042 లేదా 1075 హెల్ప్‌లైన్‌ ‌నంబరును వినియోగించుకోచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్సైటులో తెలంగాణ, వెస్ట్ ‌బెంగాల్‌ ,‌త్రిపుర, నాగాలాండ్‌ ‌మరో 4 రాష్ట్రాల పేర్లు లేకపోవడం గమనార్హం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!