Take a fresh look at your lifestyle.

మార్చి 30న శ్రీ సీతారాముల తిరుకల్యాణం,

  • 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం
  • మార్చి 22 నుండి ఏప్రియల్‌ 5‌వతేదీ వరకు శ్రీరామనవమి ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో శ్రీసీతారాముల కల్యాణ ముహూర్తంను దేవస్ధానం వైధిక కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 30వ తేదీ గురువారం శ్రీ సీతారాముల కల్యాణం, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. స్వస్థిశ్రీ చాంద్రమాన శోభకృత్‌ ‌నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మార్చి 22 వతేదీ బుధవారం నుండి చతుర్దశి మరియు పూర్ణిమ ఏప్రియల్‌ 5‌వతేదీ వరకు వనంత వక్ష ప్రయుక్త శ్రీరామనవమీ తిరుకల్యాణ సవాహ్నిక బ్రహ్మోత్సవములు నిర్వహించేందుకు వైధిక కమిటి నిర్ణయించింది.

మార్చి 30వతేదీన గురువారం 10.30 నుండి 12.30 వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవము, 31 వతేదీ శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకోత్సవము నిర్వహించనున్నారు. 22 పాడ్యమి బుధవారం శోభకృత్‌ ‌నామ సంవత్సరాది ‘‘ఉగాది’’ పండుగ నూతన పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభము, పుషర సామ్రాజ్య పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు అంకురార్పణము చేయడం జరుగుతుంది. 29వతేదీ అష్టమి బుధవారం ఎదుర్కోలు సేవ, గరుడ వాహన సేవ, శ్రీరామనవమి  శ్రీరామ పునర్వసు దీక్షా ప్రారంభం కానుంది.

Leave a Reply