Take a fresh look at your lifestyle.

థర్డ్‌వేవ్‌ ‌ముప్పు పొంచి ఉంది

  • అప్రమత్తంగా లేకుంటే క్రమంగా కేసులు పెరిగే ఛాన్స్
  • ‌హెచ్చరించిన ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌గులేరియా
  • చైనా, రష్యాల్లో విజృంభిస్తున్న కోరోనా..మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధింపు

అక్టోబర్‌ ‌నెల నుంచి క్రమంగా కొరోనా కేసులు పెరిగి, వొచ్చే జనవరి-ఏప్రిల్‌ ‌మధ్య కట్టడి చేయలేనంత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌గులేరియా అంచనా వేశారు. దీంతో ఖచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ ‌లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ‌ప్రాంతాల్లో కోవిడ్‌ ‌కేసులు పెరిగాయని పేర్కొన్నారు. ?రాష్టాల్రు  ఆంక్షలను పాటించకపోతే మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉం‌దంటున్నారు శాస్త్రవేత్తలు.

కోవిడ్‌ అం‌శంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు  ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు. భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆం‌క్షల్ని పూర్తిగా ఎత్తేసినా,  పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు.

సోషల్‌ ‌డిస్టెన్స్ ‌పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ది చేకూరుతుంది కానీ… టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని… అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు.?దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌సూచించారు.చైనా, రష్యాల్లో విజృంభిస్తున్న కోరోనా..మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధింపు చైనా, రష్యాల్లో మళ్లీ కొరోనా విజృంభిస్తున్నది. చైనాలో వరుసగా ఐదో రోజూ కొరోనా కేసుల సంఖ్య పెరిగింది.ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం వైరస్‌ ‌నియంత్రణకు చర్యలు చేపట్టింది. కొరోనా పరీక్షలను వేగవంతం చేసింది.

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేయడంతోపాటు వందలాది విమానాలను రద్దు చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ ‌విధించింది. అలాగే సరిహద్దుల మూసివేతను కొనసాగిస్తున్నది. పర్యాటకులతో కలిసి ప్రయాణించిన ఒక వృద్ధ జంట కారణంగా చైనాలో తాజాగా కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందినట్లు ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. షాంఘై నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ వృద్ధ జంట జియాన్‌, ‌గన్సు ప్రావిన్స్, ఇన్నర్‌ ‌మంగోలియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కొత్తగా డజన్ల మేర కరోనా కేసులు ఈ వృద్ధ జంట ప్రయాణంతో ముడిపడి ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు.

బీజింగ్‌తో సహా ఐదు ప్రావిన్స్‌లలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు. గత 24 గంటల్లో ఉత్తర చైనాలోని మంగోలియా అటానమస్‌ ‌రీజియన్‌లో 15 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. అల్క్సా లీగ్‌ (‌ప్రిఫెక్చర్‌) ‌లోని ఎజినా బ్యానర్‌ (‌కౌంటీ)లో పద్నాలుగు కేసులు, జిలిన్‌ ‌గోల్‌ ‌లీగ్‌లోని ఎరెన్‌హాట్‌ ‌నగరంలో ఒక కేసు నమోదైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు మూసి వేయడంతోపాటు వందలాది విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రష్యాలోని లాట్వియాలో కొరోనా మరణాలు ఇటీవల ఒక్కసారిగా పెరిగింది. వైరస్‌ ‌వ్యాప్తి అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్‌ ‌కూడా విధించింది.

ఓ వైపు వైరస్‌ ‌వ్యాప్తి చెందడం, మరో వైపు శీతాకాలం కావడంతో అంటువ్యాధుల భయం కూడా రష్యాకు తలనొప్పిగా మారింది. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌ ‌కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 30 ‌నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్‌ ‌వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు. ఇప్పటికే కొన్ని యూరోపియన్‌ ‌దేశాలు, ముఖ్యంగా యూకేలో కరోనా కేసుల పెరుగుతూ అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికితోడు శీతాకాలం సవి•పిస్తుండడంతో వైరస్‌ ‌ఫోర్త్ ‌వేవ్‌ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply