Take a fresh look at your lifestyle.

కొరోనా తో పరాచికాలు వద్దు ! జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదు

  • థర్డ్‌వేవ్‌ ‌కూడా స్వారీచేసే ప్రమాదం
  • వైద్య నిపుణుల హెచ్చరికలు

‌కొరోనా తగ్గుముఖం పడుతున్నా మరికొంతకాలం పాటు తప్పనిసరిగా నియమనిబంధనలు తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తొలిదశలో కొరోనా ఖతం అయ్యిందన్న ధీమానే రెందోదశ విజృంభణకు కారణమయ్యింది. మమంతా ఎంతగా జాగ్రత్తగా ఉంటే అంతమంచిదన్నారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరిగితే మూడోదశ కూడా ఉధృతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మనమంతా కొరోనా వలయంలో చిక్కకుని గిలగిల కొట్టుకుంటున్నాం. ఆ వలయం నుంచి బయటపడేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొరోనా తో ఇక పరాచి కాలు వద్దని గుర్తించాలి. కొరోనా ఏవి• చేయదులే అన్న ధోరని ఇక వీడాల్సిందే. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిది. భారత్‌లో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ లెక్కకు మిక్కిలి మరణాలు నమోద వుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యి కొన్ని కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. మొత్తంగా మళ్లీ అన్ని షరా మామూలు అవుతున్న వేళ మనమంతా మరింత అప్రమత్తంగా ఉండకపోతే కొరోనా కౌలిగించు కోవడం ఖాయం. సడలింపులు ఇచ్చారని, లాక్‌డౌన్‌ ‌సంకెళ్లు తెంచుకున్నామని రంకెలు వేస్తే కొరోనా•తో కష్టాలు తప్పవు. బయట ప్రపంచంలో కొరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.

ఎవరితో అది సహవాసం చేస్తున్నదో తెలియదు. ఎవరినుంచి ఎవరికి సోకుతున్నదో తెలియడం లేదు. తొలిదశలో కనీసం లక్షణాలు కనిపించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఒకరినుంచి మరోకరికి తీవ్రంగా నూ.. వేగంగానూ వ్యాప్తి చెందుతోంది. నిర్లక్ష్యంగా ఉన్నవారిని కబళిస్తోంది. కొరోనా వైరస్‌ ‌మహమ్మారిపై మన దేశం అలుపు ఎరగకుండా పోరు సాగిస్తున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరింతగా పెరుగుతందని అంచనాలు వస్తున్నాయి. వైరస్‌ ‌దండయాత్ర మొదలెట్టినప్పుడువున్న స్థాయిలో ఉన్నదానికన్నా ఇప్పుడు భయాందోళనలు పెరిగాయి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నందున ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎదుటివారితో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎదుటి వారికి కొరోనా ఉందన్న భయంతో మసలుకోవాలి. ఎవరైనా తుమ్మినా, దగ్గినా,జ్వరం వుందని చెప్పినా వారినిచూసి హడలెత్తా ల్సిందే. కొరోనా బాధితులనూ, వ్యాధిగ్రస్తుల కుటుంబాలనూ దూరంపెట్టే వారి సంఖ్య కూడా తక్కువేవి• కాదు. కానీ దాని బారినపడితే మరణం ఖాయమన్న అపోహ ఈ రెండోదశలో పెరిగిపోయింది. మరణాల సంఖ్య విపరీతంగా ఉండడం వల్ల్నే ఇలాంటి భయాలు వస్తున్నాయి. ప్రజలు నిజంగానే భయపడే వారు అయితే జాగ్రత్తలు తీసుకుని ఉంటే వైరస్‌ ‌విజృంభణ ఆగిపోతుంది. కానీ అలాజరగడం లేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా నేటికీ ఎవరికివారు తమకేవి• కాదులే అన్న ధీమాలో ఉంటున్నారు.

అలాగే వ్యాధి గురించి వెల్లడిస్తే దోషిగా పరిగణిస్తారన్న భయం కూడా తగ్గింది. వ్యాధి గురించి భయపడ తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది దరిచేరదని అవగాహన ఏర్పడినా పాటించడంలో ఇంకా నిర్లక్ష్యం కానవస్తోంది. ప్రస్తుతానికి మనం కొరోనా జాబితాలో ప్రపంచంలో ముందున్నాం. వ్యాధిగ్రస్తుల సంఖ్య, మరణాల సంఖ్య ఎక్కువున్నట్టే అనిపిస్తున్నా ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. లాక్‌డౌన్‌ ‌సంకెళ్లు దాదాపు మెల్లగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలు మళ్లీ గాడిన పడుతున్నాయి. కుదేలయిన భారత్‌ ఆర్థికరంగం మళ్లీ గాడిన పడాలని ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయి. అందుకే మెల్లగా సడలింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజలు కూడా పనిచేసుకుంటే తప్ప పూటగడవని వారు ఎందరో ఉన్నారు. అందుకే లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావాలని కోరుకోకోవడం లేదు. దీనికితోడు కొరోనా భయం ఉన్నా.. ఆకలి భయం చంపేస్తోంది. అందుకే ప్రజలు తమ విధుల్లో చేరేందుకు ఉత్సాహంగా పరుగెడుతున్నారు. దీంతో రోడ్లన్నీ మళ్లీ బిజీగా ఉన్నాయి. కాళుష్యం మళ్లీ కళ్లకు కనిపిస్తోంది. ముఖానికి మాస్క్ ‌తప్పనిసరిగా ధరించాలి.

అంటే వైరస్‌ ఎం‌తో తీవ్రంగా మనచుట్టూ తచ్చాడుతున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజలు ప్రస్తుత వాతావరణాన్ని మననం చేసుకుంటూ మసలుకోక పోతే మనకూ అది మనచెంతకు రావడానికి ఎంతో దూరం లేదని గ్రహించాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రజల్ని మరింత అప్రమత్తం చేయక తప్పదు. కొరోనా విషయంలో కచ్చితంగా తీసుకునే జాగ్రత్తలే ప్రాణహాని నుంచి కాపాడతాయని ప్రజలు గుర్తించి ముందుకు సాగితే తప్ప ప్రమాదం నుంచి తప్పుకోలేం. మాల్స్, ‌గుళ్లూ తెరుచుకుంటున్నాయి కనుక పొలోమని పరుగెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వాలి చ్చిన వెసులు బాట్లు ఆసరా చేసుకుని దైనందిన కార్యకలాపాలు మళ్లీ గతంలో లాగానే స్పీడ్‌ అం‌దుకుం టున్నాయి. వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. అయితే చాలా చోట్ల భౌతిక దూరం పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో భౌతిక దూరం పాటించడం లేదు. కొరోనా కు దూరంగా ఉండడంతో పాటు పర్యావరణానికి హాని చేకూర్చే విధానాలకు స్వస్తి చెప్పడం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు మానుకోవడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవ డానికి ప్రాధాన్యవి•యడం ప్రస్తుత అవసరం అన్నది గుర్తించ మసులకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఏమరుపాటు ప్రదర్శిస్తే ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరిస్తున్న సంగతిని మరువరాదు. లేకుంటే కొరోనా మరణాల సంఖ్య పెరిగే జాబితాలో మనపేరూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Leave a Reply