Take a fresh look at your lifestyle.

భద్రాద్రి వద్ద మూడవసారి.. పెరుగుతున్న గోదావరి

ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదనీరు విడుదల చేయటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ పెరుగుతుంది. 22 అడుగులు ఉన్న గోదావరి సోమవారం సాయంత్రానికి 30 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా మంగళవారం మధ్యాహ్నానికి 40 అడగులు, సాయంత్రానికి 43 అడుగులకు చేరుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గోదావరి వరదలు భారీగా వచ్చి ప్రజలను అస్తవ్యస్తం చేసింది. వరదనీరు ఉండటంతో పంటపొలాలు నాశనం అయ్యాయి.

మళ్ళీ ఎగువ ప్రాంతాల్లో భారీగా వస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్న డ్యామ్‌లు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో క్రింది భాగానికి నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద మళ్ళీ మూడవ సారి వరద నీరు పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా పునారావాస కేంద్రాల్లోనే తలదాచుకున్న వరద బాధితులు మూడు రోజుల క్రితమే వారివారి ఇండ్లను శుభ్రం చేసుకుని వెళ్ళారు. మళ్ళీ వరద వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సిడబ్ల్యూసి అధికారులు మాత్రం వరద ప్రభావం అంతగా ఉండదని చెప్తున్నారు.

Leave a Reply