Take a fresh look at your lifestyle.

మూడో అడుగు

నింగికి-నేలకు మధ్యన
మిథ్యల మిద్దెలు
చీకటి-వెలుగుల మధ్యన
నీడల సరిహద్దులు
తూర్పు- పడమరల మధ్యన
ఉదయాస్తమానాల పొద్దులు
మంచి- చెడుల మధ్యన
చెప్పలేని అనర్థాలు
ధర్మం – అధర్మం మధ్యన
యుగయుగాల యుద్ధం
ప్రేమ – పగల మధ్యన
తీరని ఆవేదనలు
మనిషికి – మనిషికి మధ్యన
అహంభావాల అడ్డుగోడలు
జీవికి – జీవికి మధ్యన
బ్రతుకు దెరువు పోరాటాలు
రెండు కన్నుల మధ్యన
కనిపించని బ్రహ్మ రాతలు
రెండు గుండెల మధ్యన
ఉఛ్వాస నిశ్వాస ల ఉల్లాసం
రెండు అడుగుల మధ్యన
అదృష్టం
విజయానికి ‘మూడో అడుగు’!
       – పి.బక్కారెడ్డి, 9705315250

Leave a Reply