Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలోనే తిమ్మాజిపేట సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

నాగర్‌ ‌కర్నూల్‌,‌మే 23.ప్రజాతంత్రవిలేకరి: నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో పీఏసిఎస్‌ ‌కార్యాలయంలో ప్రజాప్ర తినిధుల అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సదస్సుకు నాగర్‌ ‌కర్నూల్‌ ఎంఎల్‌ఏ ‌మర్రిజనార్ధన్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ సూచనలు,సలహాలు అందించారు. అనంతరం ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో డీసీసీబీ డైరెక్టర్‌ ‌జక్కా రఘు నందన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్న సొసైటీని లాభాల్లో నడిపించేందుకు పాలక మండలి సిద్ధంగా ఉందని అన్నారు. తిమ్మా జీపేట్‌ ‌మండలంలోని రైతులందరికీ ఎలాంటి విత్తనాలు ఎరువుల కొరత లేకుండా 500 మెట్రిక్‌ ‌టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నా యని తెలిపారు, రాబోయే కాలంలో రైతులం దరికీ క్రాప్‌ ‌లోన్స్,‌గోల్డ్ ‌లోన్స్,ఇతర లోన్స్ ‌తిమ్మాజీపేట్‌ ‌పీఏసిఎస్‌ ‌కార్యాలయంలో రుణాలు అందజేస్తాం అని తెలిపారు. ఇప్పటికే వివిధ రకాల లోన్స్ ‌కొసం 50 లక్షల రూపాయలు మంజూరు అయినవి అని తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలో తిమ్మాజీ పేట్‌ ‌సొసైటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు,రాబోయే రోజుల్లో తిమ్మాజీపేట్‌ ‌మండలంలోని రైతులను ఎలాంటి ఇబ్బందు లు లేకుండా మెరుగైన సేవలు అందించడా నికి పాలకమండలి అహర్నిశలు కృషి చేస్తోం దని అన్నారు.

రైతులు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకంగా రుణాలు అందజేస్తాం అని తెలిపారు.రేపటి నుండి 2 కోట్ల రుణాలు అందజేయడానికి సొసైటీ సిద్ధంగా ఉంది అని తెలిపారు.తిమ్మాజీపేట్‌ ‌మండలంలోని రైతులు అందరూ రేపటి నుండి దరఖాస్తు చేసుకోగలరని సూచించా రు.ఈ కార్యక్రమంలో మార్కెట్‌ ‌చైర్మన్‌,అన్ని మండలాల పీఏసీఎస్‌ ‌చైర్మన్లు, తిమ్మాజీపేట్‌ ‌మండలంలోని ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy