Take a fresh look at your lifestyle.

పట్టణంలో దొంగల హల్‌చల్‌

‌జనగామ: నూతన సంవత్సర వేడుకలలో పట్టణ ప్రజలందరు నిమగ్నమై ఉండగా ఇదే అదునుగా భావించిన దొంగలు భీభత్సం సృష్టించారు. జిల్లా కేంద్రంలోని సూర్యపేట రహదారిలోని మణి ఐరన్‌ ‌సిమెంట్‌, శ్రీ‌సాయి స్టీల్స్, ‌మల్లిఖార్జున ఐరన్‌, ‌హార్డ్‌వేర్‌ ‌మర్చంట్‌లో దొంగలు అర్థరాత్రి షెటర్‌ ‌తాళాలను పగలగొట్టి షాపులో చొరబడి సుమారుగా రూ.10వేలను ఎత్తుకెళ్లారు. సిమెంట్‌, ఐరన్‌ ‌దుకాణాలు కావడం వలన షాపులో అధిక డబ్బులు ఉండకపోవడంతో షాపు యజమానులు ఊపిరిపీల్చుకున్నారు.

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి ఎస్‌ఐలు కాసర్ల శ్రీనివాస్‌, ‌రాజేష్‌ ‌నాయక్‌లు చేరుకుని కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌ ‌టీమ్‌, ‌డాగ్‌ ‌స్వ్కాడ్‌ ‌షాపుల పరిసరాలను పరి శీలించి షాపు యజమానుల నుంచి వివరాలను తెలుసుకుని సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలను సేకరించారు. సీసీ ఫుటేజీలో ఆరుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఐ ‌రాజేష్‌ ‌నాయక్‌ ‌మాట్లాడుతూ ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటుచేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటే నేరాలను అరికట్టవచ్చన్నారు.

Tags: thieves in janagama, cc cameras, si kasarla srinivas, dog squad, many iron cement, sri sai steels

- Advertisement -

Leave a Reply