Take a fresh look at your lifestyle.

హోమ్ క్వారంటైన్‌లోని వారు సహకరించాలి ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌

సూర్యాపేట, మే 11, ప్రజాతంత్ర ప్రతినిధి): హోమ్ ‌క్వారంటైన్‌లో ఉన్న వారు సహకరించాలని జిల్లా ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ ‌కోరారు.సోమవారం జిల్లా పోలీస్‌ ‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతు ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుండి జిల్లాకు వచ్చిన వారిని గుర్తించి హ•మ్‌ ‌క్వారంటైన్‌ ‌చేయడంలో పోలీసులు బాగా పనిచేస్తు న్నారని అన్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా నిర్మూలనలో జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం అప్రమ త్తంగా ఉందని తెలిపారు.

లాక్‌డౌన్‌ ‌నిబంధనలు పక్కగా అమలు చేస్తు అంతర్‌రాష్ట్ర, అంతర్‌ ‌జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహనాల రాక, పోకలను నిషేధించామని పేర్కొన్నారు. హోమ్ ‌క్వారంటైన్‌లో ఉన్న వారిని డిజిటల్‌ ‌జియో ట్యాగింగ్‌ ‌చేసి ఎప్పటిక ప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. పర్యవేక్షణ చేయడానికి బ్ల్యూకోట్స్, ‌టెక్నికల్‌ ‌టీమ్‌, ‌పెట్రోకార్‌ ‌సిబ్బంది, స్థానిక ఎస్సైలు పనిచేస్తున్నారని వెల్లడించారు. హ•మ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్న వారు ఎట్టిపరిస్థితుల్లో ఇంట్లో నుండి బయటకు రావొద్దని సూచించారు. పోలీస్‌సిబ్బందికి, వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు.

Leave a Reply