5 నెలలుగా తమకు జీతాలివ్వడం లేదు
ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపణ
అమరావతి,ఆగస్ట్ 4 : 5 నెలలుగా తమకు జీతాలివ్వడం లేదని చెప్పిన మున్సిపల్ ఉద్యోగులపై తప్పుడుకేసులు పెడతారా? అని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. తప్పుడు కేసులుపెట్టారు కాబట్టే, ఉద్యోగులు వెంటనే బెయిల్ పై బయటకువచ్చారని చెప్పారు. ప్రభుత్వం ఆర్థికంగా ఎంతపతనమైందో చెప్పడానికి మంగళగిరి మున్సిపల్ సిబ్బంది అరెస్టే ఉదాహరణ అన్నారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బందికి జీతాలిచ్చిన ప్రభుత్వం, కిందిస్థాయి పారిశుధ్యకార్మికులకు ఆపడంఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం అవసరమనుకున్నవారికి అర్థరాత్రి జీతాలిస్తోందన్నారు. పారిశుధ్యకార్మికులు టీడీపీవారు ఆర్థికసాయం చేయాలని చూస్తే, అది తీసుకుంటే, వారిని ఉద్యోగంలోనుంచి తొలగిస్తామని బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. 3 వతేదీ వచ్చినా చాలామందికి ఇంకాజీతాలు, పింఛన్లురాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ 2వతేదీ నాటికి ఉద్యోగులకు, జీతాలు, పింఛన్లు అందని పరిస్థితిలేదన్నారు.టుందని భరోసా ఇచ్చారు. నిర్వాసితుల సమస్య తమ సమస్యగా తీసుకుంటున్నామని రామ్మోహన్నాయుడు చెప్పారు.