Take a fresh look at your lifestyle.

ఇళ్లకు రారు.. ఇచ్చేదీ ఇవ్వరు..

  • వరద బాధితుల పరిహారంలో అవకతవకలు
  • స్థానిక అధికారులపై మండిపడ్డ మహిళలు
  • తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

స్థానిక నియోజకవర్గంలో వరద బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులదే హవా నడుస్తోంది. భారీ వరదలు నగరంలోని అనేక ముంపు ప్రాంతాల నివాసితులకు కనీవిని ఎరుగని నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తామన్న రూ.10వేల పరిహారంపై ఎంతోమంది ఆశలు
పెట్టుకున్నారు. వివిధ కాలనీల్లో పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. అర్హులైనవారు అధికారులు, స్థానిక నేతల వద్దకు వెళ్లి ప్రాధేయపడుతుండగా.. పలుకుబడి ఉన్నవారు, కొంతమంది నాయకులు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కొన్నిచోట్ల కనిపించింది.

ఇంకొన్ని ప్రాంతాల్లో అసలు ఇంతవరకు పరిహారమే ఇవ్వలేదు. వరదలతో ఇబ్బందులు ఎదుర్కున్న ప్రతి కుటుంబానికి కార్పొరేటర్లతో కలిసి, జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది పరిహారం అందజేయాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అధికారులు కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులే ఈ తంతు నిర్వహిస్తున్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో డబ్బులు అందజేస్తున్నారన్న ఆరోపణలు వొస్తున్నాయి. ఇచ్చేటప్పుడు కొంత నొక్కేస్తున్న ఉదంతాలూ వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు ప్రభుత్వం చేపట్టిన పరిహారం పంపిణీ వ్యవహారం స్థానిక నియోజకవర్గం, గాజుల రామవరం డివిజన్‌లో కుంటుపడిందని చెప్పవచ్చు.

చంద్రగిరి నగర్‌లో అసలైన బాధితులకు కాకుండా తెరాస కార్యకర్తలు, వారి అనుచరులకే పరిహారం ఇస్తున్నారని ఆప్రాంతంలో స్థానిక మహిళలు తెరాస ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. వివరాలు సేకరించి తమకు పరిహారం ఇవ్వలేదని పలువురు వరద బాధితులు వాపోయారు. ఇప్పటికైనా పై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, అసలైన వరద బాధితులను గుర్తించి, బాధితులకు సజావుగా పరిహారం పంపిణీ చేసే విధంగా చర్యలు చేనట్టాలని కోరుకుంటున్నారు.

Leave a Reply