తాత్కాలిక రాజకీయ పదవులకోసం ప్రజల్లో శాశ్వత దూరం సృష్టించకండి.
మొన్న ఏకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తమకు మేయర్ పీఠం అప్పగిస్తే పాతబస్తిపై సర్జికల్ స్ట్రేయిక్ చేస్తామని, పాకిస్తాన్, రోహింగ్యాలను వెళ్ళకొడుతామని వ్యాఖ్యలుచేయడంతో నగర అవాక్కవడం ప్రజల వంతైంది. దీనిని బట్టి హైదరాబాద్లో అక్రమంగా వేరే దేశస్థులు ఉన్న సమాచారం బిజెపి వద్ద ఉంటే ఇంత కాలం నుంచి ఎందుకు ఆసమాచారాన్ని దాచి పెట్టారు. రోహింగ్యాలను తరిమి కొట్టడానికి మేయర్ పదవి అవసరం ఏముంది. దే• •ప్రధానియే తమ పార్టికి చెందిన వ్యకి్త అయినప్పుడు చిన్న పదవి ఐన మేయర్ పీఠం ఎలా అడ్డు వస్తుందో అర్థం కాని విషయం.
దుబ్బాకలో అతిస్వల్ప మెజారిటీతో గెలిచిన పార్టీ మరీ ఇంత దూకుడు ప్రదర్శించడం అవసరమా అనేది కూడా వోటర్ మదిలో మెదులుతుంది. ఇంకోవైపు చూస్తే ఎంఐఎం ఇంచుమించు ఈ పార్టీకూడా ఒక మతానికి సంభందించినదిగా ప్రాచుర్యంలో ఉంది, ఈ పార్టివల్ల ముస్లిం మైనారిటీలకు ఎం లాభం జరిగిందంటే సమాధానం లేదు కాని హైదరాబాద్ లాంటి ఎన్నికలలో ఈ పార్టీపై ఎక్కుపెట్టి సామాన్య జీవితం గడిపే ముస్లిం ప్రజల మనోభావాలను గాయపర్చటం జరుగుతుంది. ఒక్కోసారి ఆలోచిస్తే మేధావులు, కవులు, రచయితలు, విద్యావంతులతో కూడిన బంగారు తెలంగాణాలో మత తత్వ పార్టీల ఉనికి అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరియు ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే అత్యంత ప్రధానం కాగా, సంఘ విద్రోహశక్తులను అణిచేందుకు పోలీస్ వ్యవస్థ కూడా తమ మూడవ కన్నును ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సామరస్యాన్ని దెబ్బతీసే రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిని, సంఘ విద్రోహశక్తులను ఉక్కుపాదంతో అణిచి వేయాలి.

ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, 9492791387