- గవర్నర్‌ను అడుగడుగునా అవమానించే చర్యలు
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ బండి సంజయ్
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి
స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ ఇవ్వటం లేదని కేంద్రమే స్వయంగా చెబుతోందన్నారు. మరోవైపు ఎసై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు తప్పులు తడకగా ఉన్నాయని విమర్శించారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పుడు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే ఎంపీ అర్వింద్ పై ప్రభుత్వం కక్ష కట్టిందని బండి ఆరోపించారు. బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ పై పోలీసులే విచక్షణారహితంగా దాడి చేశారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోందన్న బండి సంజయ్.. ఎస్, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల కోసం బీజేపీ చాలా కాలం నుంచి ఉద్యమం చేస్తోందని చెప్పారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్తే బీజేపీ కార్యకర్తలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో పోలీసుల దాడులు చాలా ఎక్కువయ్యాయని విమర్శించారు. పోలీసుల దాడిలో గాయాలపాలైన భానుప్రసాద్ కు ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ట్రీట్ మెంట్ జరుగుతోందని, ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని్గ •ర్ అయ్యారు బండి సంజయ్.. దేశంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ కంటే ఎక్కువగా ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో కండిషన్స్ ఉన్నాయి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలో 20 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి. తప్పులు చేసింది కేసీఆర్, అందుకు 2 లక్షల మంది ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఎవరికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. మంత్రులందరూ రబ్బరు స్టాంపులుగా మారారు. కేసీఆర్ నిజాం రాజులా ప్రవర్తిస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి.బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదన్న బండి సంజయ్.. ఎక్కడ ఏర్పాటు చెయ్యాలో కూడా చెప్పలేదన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సర్పంచుల నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చకు రావాలని సవాల్ విసిరారు.