వాళ్ళ అమరులు
దేశం కోసం ప్రాణాలిచ్చిన
వీరులు
వాళ్ళత్యాగాల పలవరింతలో
ఆర్తిగా కరిగి కన్నీరౌతున్న నేల.
కష్టకాలంలో ఈ మట్టి మీద
బుట్టిన
మనుష్నులమంతా ఒక్కటేనని
తట్టిలేపిన మమకారం
మనుషులమైనందుకే కదా
మనలో ఇంత ఆర్ద్రత.
జెండాల ఎజెండాల మధ్య నలిగి
విద్వేషాల విషబీజాలతో
బండ బారిన గుండెలను సైతం
కదిలించిన
ఈ త్యాగాలను ఎట్లా ఎత్తి పట్టాలి
ఇంకెట్లా నిలబెట్టు కోవాలి
సామ్రాజ్రవాద కాంక్షతో
రక్తం రుచిమరిగిన
దేశాల ముందు మోకరిల్లి
దోచిపెట్టే విధ్వంసాలకు
దాసోహమన్నప్పుడు
మతాల మత్తులో
కులాల కుమ్ములాటలో
లంచాలలో వడ్డించిన కంచాలలో
కళ్ళుతేలేసిన కర్కషత్వం కూడా
ఇప్పుడు దేశభక్తి జెండాను మెడలో వేసుకొని
కారుస్తున్న మొసలి కన్నీరు
ఎవరి మెప్పుకోసం
ఎవర్ని మెప్పించడాని కోసం
పాలకుల కోసమైతే వద్దు
ఇప్పటికైనా
ప్రజల కోసం నిలబడితె
సమస్యలపై కలబడితే
నీవు ఒక సైనికుడివే
అప్పుడు చూడు దేశ సరిహద్దుల వైపు
నిదానించి
నిజాలు నిగ్గు తేలుతై
కొండలు గుట్టలు లోయలు
మనషులు సహజంగా బతికే స్థితి లేని
గడ్డ గట్టే చలిలో
అరకొర సౌకర్యాల మధ్య
సరిజేసుకోలేని సరిహద్దుల కోసం
నిత్యం ఘర్షణల్లో
గాల్లో దీపాలౌతున్న ప్రాణాలు
బతుకు వేటలో సాగిన
బడుగు జీవులవేననీ.
అయినాఏండ్లు గడుస్తున్న ఎందుకీ వైరాలు
ప్రపంచమంతా అరచేతిలో
అద్దంలా కళ్ళముందు కనబడతున్ప
ఈ యుద్ధగీతాలేమిటి
సమస్యలన్నీ సామూహికమై
కత్తులకందని మృత్యువు
కర్కషంగా కబలిస్తున్న
కలహాలు మానలేమా
కలివిడిగా బతకలేమా
కంటికి కనబడకుండా కాటేసే
వైరస్ ల లెక్కనే
ఇల్లు చక్కబెట్టుకోలేని ఇరకాటంలో
అలుముకున్న పన్నాగాలు…
ఆకలి అనారోగ్యం నిరుద్యోగం
స్కాములు స్కీములు
అన్నీ బలాదూర్.
ఉద్వేగాలు ఉప్పెనలాఎగసి
చప్పున సల్లారే
సంధి కాలంలో సర్దుబాట్లన్నీ
చక్కబడుతాయి.
కాసేపట్లో ట్యాన్ మారతుంది
శాంతి కాముక దేశం వినిపించే
సంగీతంలో
ఓలాడుతూ లీనమవుతాం
వెనుక తిరిగి జూసుకొంటే
ఎప్పటి సిప్ప ఎనుగుల్నే
కాక పోతే అమరుల స్మృత్యర్థంలో
అవార్డుడులు నాట్య మాడుతాయి
– గన్ రెడ్డి ఆదిరెడ్డి,
944789731
Prev Post