Take a fresh look at your lifestyle.

మొహర్రం రోజు పాటించాల్సిన కోవిడ్‌ ‌నిబంధనలు ఇవే!

అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్‌-19 ‌నిబంధనలు మొహర్రం పండుగలో భక్తులు తప్పకుండా పాటించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్‌ ఇలియాజ్‌  ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20 నుంచి పది రోజులు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

పండుగ రోజు పాటించాల్సిన కోవిడ్‌ ‌నియమాలు:
పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్‌ ‌కమిటీ సభ్యులు కలిసి 10 మందికి మించకుండా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రజలకు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి. పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉంచాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు పీర్ల చావిడి వద్దకు రాకుండా చూడాలి. మొహర్రం (షాహదత్‌) ‌చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవచ్చు.పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం.పై కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!