Take a fresh look at your lifestyle.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఉండవు

Donald Trump Holds Rally In Bethpage, New York

  • పర్యటనకు ముందే భారత్‌కు ట్రంప్‌ ‌షాక్‌
  • ‌కొనసాగుతున్న భారీ ఏర్పాట్లు

పర్యటనకు ముందే అమెరికా అధ్యక్షుడు ఇండియాకు షాకిచ్చారు. భారత్‌ ‌పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూనే ..ఈ పర్యటనలో ఎలాంటి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు ఉండవని స్పష్టం చేశారు. భారత్‌తో ట్రేడ్‌ ‌డీల్స్ ‌కు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. మోడీతో మా మైత్రి చిరకాలం కొనసాగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల్లో భారత్‌ ‌రానున్న ట్రంప్‌ ‌కోసం భారీ ఏర్పాట్లు చేసింది కేంద్రం. ఇటు గుజరాత్‌ ‌సర్కార్‌ ‌ట్రంప్‌ 3‌గంటల పర్యటన కోసం అహ్మదాబాద్‌ ‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ఫిబ్రవరి 24న భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పర్యటనలో భాగంగా డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా ఎయిర్‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం ఉపయోగిస్తారు. అందులోనే ట్రంప్‌ ‌దంపతులు భారత్‌ ‌పర్యటనకు రానున్నారు. ప్రపంచంఎక్కడికి వెళ్లినా వారు ఈ విమానంలోనే వెళ్తుంటారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుని ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఇది వరకు పనిచేసిన అధ్యక్షుల విమానాలతో పోలిస్తే ప్రస్తుతం ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌బోయింగ్‌ 747-200 ‌విమానం అత్యంత శక్తివంతమైనది. అతి పెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అధ్యక్షలుగా ఉండే వారు ప్రయాణాలకు వివియోగించే విమానాలలో లాంగ్‌ ‌రేంజ్‌ ‌గల విమానం ఇది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు. ఇందులోని సౌకర్యాలను ఒకసారి పరిశీలిస్తే.. గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం కలదు. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లోర్‌ ‌స్పేస్‌ ఉం‌టుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్ ‌హాల్‌, ‌డైనింగ్‌ ‌రూమ్‌, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్‌ ‌స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ఉద్యోగులకు, డియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి.

ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్‌ ‌సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం. హాల్‌ ‌శాటిలైట్‌ ‌కమ్యూనికేషన్‌ ‌కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ కలదు. ఎయిర్‌ఫోర్స్ ‌వన్‌పై దాడులు జరిగితే మొబైల్‌ ‌కమాండ్‌ ‌సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్‌ ‌శాటిలైట్‌ ‌కమ్యూనికేషన్‌ ‌కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు కలవు. ఇది టేకాఫ్‌ ‌తీసుకునేటపుడు ఇది మోయగలిగే బరువు 8,33,000 పౌండ్లు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఉండే భవనం శ్వేత సౌధం అయితే.. ప్రయాణించే ఎయిర్‌ ‌ఫోర్స్ ‌వన్‌ ‌విమానం ఎగిరే శ్వేత సౌధంగా చెప్పవచ్చు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!