- టిఆర్‌ఎస్, బిజెపిల సభల్లో పరస్పర విమర్శలే
- మండిపడ్డ కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 22 : మునుగోడులో వేర్వేరుగా నిర్వహించిన సభల్లో సీఎం కేసీఆర్, కేంద్రం మంత్రి అమిత్ షాలు సామాన్యుల గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయం గురించే మాట్లాడారని టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మునుగోడులో గెలిస్తే ఏం చేస్తామని కేసీఆర్ కానీ, అమిత్ షా కానీ చెప్పకపోగా.. ఒకరిపై ఒకరు విమర్శలకు పరిమితమయ్యా రని ఆరోపించారు. కాంగ్రెస్ గెలవకూడదని బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకరినినొకరు తిట్టుకుంటూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో బీజేపీకి ఓటు వేసినా ..
టీఆర్‌ఎస్‌ను గెలిపించినా సామాన్యుడికి న్యాయం జరగదన్నారు. ఒక బాధ్యతయుత ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్‌షా చెప్పులు మోయడమంటే..తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్‌షా కాళ్ల దగ్గర పెట్టడమేనన్నారు. మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది.టిపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ.. బీజేపీ గెలిస్తే మోటార్లను వి•టర్లు పెడతారని చెప్పడం కొత్తేమి కాదని, సెంటిమెంట్‌తో కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం లో కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండే వాడని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి ? రాష్ట్రంలో ప్రతి స్కాం లో టీఆర్‌ఎస్ నాయకులే ఉన్నారని ఆరోపించారు.
ఇదిలావుంటే కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలను రెచ్చగొట్టడంలో బీజేపీ ముందుంటుందని విమర్శించారు. రాష్టాన్రికి కేంద్రం ఏం చేసిందన్న దానిపై అమిత్‌షా మాట్లాడలేదన్నారు. రాజకీయ వి•టింగ్‌లకు జనం ఎలా వస్తారో అందరికీ తెలుసన్నారు. కేసీఆర్ అవినీతి పరుడని బీజేపీ చెబుతున్నప్పడు ఆయనపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.