Take a fresh look at your lifestyle.

నీతి ఆయోగ్‌ ‌నిబద్దతపై స్పష్టత రావాలి !

ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ ఏర్పటు చేసిన తరవాత కేంద్రరాష్టాల్ర మధ్య సంబంధాలు, నిధులు బదలాయింపు తదితర విషయాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలి. నిజానికి కేంద్ర రాష్టాల్ర మధ్య పెద్దగా సంబంధాలు సరిగా లేవు. నిధుల షేరింగ్‌ ‌కూడా సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బదలాయింపులు సక్రమంగా లేవు. ఇవన్నీచర్చించి, దేశానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. అలాగే ఈ ఏడేళ్లలో ప్రణాళికా సంఘానికి భిన్నంగా నీతి ఆయోగ్‌ ‌చేసిందేమిటో కూడా చెప్పాలి. తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌లేవనెత్తిన అంశాలనే ఇతరరాష్టాల్ర సిఎంలు కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు.

ఈదశలో విమర్శలకు తావులేకుండా ముందుకు సాగాల్సి ఉంది. ఇది దేశ అభివృద్దికి సంబంధించిన విషయంగా చూడాలి. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్‌ ‌సరికొత్త వ్యవస్థగా ఏర్పడింది. దేశంలోని అన్ని రాష్టాల్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్‌ ‌గవర్నర్లు దీని పాలకమండలిలో సభ్యులుగా ఉన్నారు. దీనిలో ఐదుగురు పూర్తికాల సభ్యులు, ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరినీ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి ఎంపిక చేసుకుంటారు. పదవిలో కొనసాగుతున్న కేంద్రమంత్రుల నుంచి నలుగురు దీనిలో సభ్యులుగా ఉంటారు.

శక్తివంతమైన రాష్టాల్రతోనే శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్‌ అం‌దిస్తుంది. ఇది ఆర్థికాంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ విషయాలపై సూచనలను ఇస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్టాక్రు చురుకైన పాత్రను, భాగస్వామ్యాన్ని కల్పిస్తుందని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసే యంత్రాం గాన్ని తీర్చిదిద్ది, వాటి అమలు తీరును పర్యవేక్షించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రత ప్రయోజనా లను చూస్తుంది.

ఆర్థిక పురోగతి నుంచి తగినంత లబ్ది పొందలేక పోతున్న సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. పౌరుల భాగస్వామ్యాన్ని పెంచడం, అందరికీ అవకాశాలు కల్పించడం, భాగస్వామ్య పాలన, సాంకేతిక వినియోగాన్ని పెంచడం వంటివి దీని ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు.అయితే ఇటీవలి కాలంలో ఆయారాష్టాల్ర సిఎంలు మాత్రం దీని లక్ష్యాలు నెరవేరడం లేదన్న వాదన చేస్తున్నారు. జిఎస్టీ వల్ల రాష్టాల్ర ఆర్థిక పరిస్థితి పడిపోయిందని, జిఎస్టీ లాభాలను మరో ఐదేళ్లు పొడగించాలని ఇటీవలి జిఎస్టీ మండలి సమావేశంలో పలువురు సిఎంలు డిమాండ్‌ ‌చేశారు.

దీనిని కూడా నీతి ఆయోగ్‌ ‌పరిగణనలోకి తీసుకోవాలి. ఇకపోతే గతంలో ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలను సిద్దం చేసి, నిధులు కేటాయించేలా చేసి అభివృద్దికి దోహదపడేది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అసలు రూపాన్ని సీఎం కేసీఆర్‌ ‌బయట పెడితే అది రాజకీయరంగు పులుము కుందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై కేందరమంత్రి కిషన్‌ ‌రెడ్డి కూడా ఎదురుదాడి చేశారు. నిజానికి దాడులు, ఎదురుదాడులు రాజకీయాల్లో తప్ప అభివృద్దిలో కానరా వద్దు. సీఎం కెసిఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబివ్వని నీతి ఆయోగ్‌.. ‌బీజేపీకి వంతపాడుతూ పత్రికా ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యమని మంత్రి హరీష్‌ ‌రావు కూడా అన్నారు. రాష్టాల్రకు నిధులు ఇవ్వట్లేదని 15వ ఆర్థిక సంఘం, కాగ్‌.. ‌రెండూ చెప్పాయి. 32 నుండి 42 శాతానికి రాష్టాల్రకు నిధులు పెంచామని నీతి ఆయోగ్‌ అం‌టోంది. కానీ కేంద్రం.. సెస్సుల పేరుతో రాష్టాన్రికి రావాల్సిన వాటా రాకుండా చేస్తోంది.

తద్వారా రాష్టాల్ర నోరు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ వాదనగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. గత ఎనిమిదేళ్లుగా అభివృద్ధి విప్లవాన్ని నిశ్శబ్దంగా అమలు చేస్తున్న నీతి ఆయోగ్‌ ‌మూలంగానే దేశంలో లక్షల కోట్ల మేరకు మౌలిక సదుపాయాలు అమలు అవుతున్నాయని అంటున్నారు. అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అనేక సంక్లిష్ట మైన సమస్యలను కేంద్ర, రాష్టాల్రతో కలిసి పనిచేయడం ద్వారా నీతి ఆయోగ్‌ ‌పరిష్కరించింది. జీడీపీ పెరుగుదలలో మాత్రమే కాదు, అనేక నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణల వెనుక నీతి ఆయోగ్‌ ‌హస్తం ఉన్న దన్న వాదన చేస్తోంది. దేశమంతా ఒక టీమ్‌ ఇం‌డియా స్ఫూర్తితో పనిచేసినందుకే కరోనా మహమ్మారిని తిప్పిగొట్టగలిగామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీతి ఆయోగ్‌ ఆదివారం నాడు జరిగిన ఏడవ గవర్నింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశంలో అన్నారు. దేశాన్ని ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా చేయడంలో రాష్టాల్రు ప్రముఖ పాత్ర పోషించాయని ఆయన ప్రశంసించారు. పప్పు ధాన్యాలు, చమురు గింజలు, ఇతర వ్యవసాయోత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధి, పంటల మార్పిడి, జాతీయ విద్యావిధానం అమలు, పట్టణ పాలనపై కీలక చర్చలు జరిగాయి. వివిధ రంగాల్లో కేంద్ర, రాష్టాల్రు కలిసికట్టుగా పనిచేసి దేశాన్ని అభివృద్ధి పరచడం ప్రపంచం దృష్టికి వచ్చిందని, అందుకే 2023లో జీ-20 నాయకత్వం భారత్‌కు లభించనున్నదని మోదీ ప్రకటించారు, భారతదేశమంటే ఢిల్లీ మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రమూ, కేంద్రపాలిత ప్రాంతమూ కూడా అని ప్రకటించే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. వర్తకం, పర్యాటక రంగం, టెక్నాలజీని ప్రతి రాష్ట్రం ప్రపంచంలోని మన రాయబార కార్యాలయాల ద్వారా పెంపొందించు కోవాలని, ఎగుమతులు పెంచుతూ దిగుమతులను తగ్గించుకోవాలని సూచించారు.

స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రూపొందించిన ’వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌రాజకీయ నినాదం కాదని, అది కేంద్ర, రాష్టాల్ర సమాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జీఏస్టీ వసూళ్లు పెరిగేందుకు కూడా కలిసికట్టుగా పనిచేయా లని, దేశాన్ని 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని చెప్పారు. జాతీయ విద్యావిధానాన్ని కూడా నిర్ణీత కాలంలో దేశమంతటా అమలు చేయాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లలో సెస్సుల రూపంలో వసూలు చేసింది రూ.15,47,560 కోట్లు. ఈ ఏడాది రూ.5,35,112 కోట్లు. రెండూ కలిపితే.. మొత్తం రూ.21 లక్షల కోట్లు. 41శాతం రాష్టాల్రవాటా అంటే.. దానిప్రకారం రూ.8,60,000 కోట్లు హక్కుగా అన్ని రాష్టాల్రకూ రావాలి.

కానీ సెస్సుల పేరుతో కేంద్రం చేస్తున్న అన్యాయం కారణంగా.. తెలంగాణకు రావాల్సిన రూ.42 వేల కోట్లు రాకుండా పోయాయి. నీతి ఆయోగ్‌ ‌విలువ దిగజారిందని కెసిఆర్‌ ‌విమర్శించారు. రాష్టాల్ర హక్కులు పోతుంటే సహకార సమాఖ్య స్పూర్తి ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్‌ ‌చేసే సిఫారసులను కేంద్రం చెత్త బుట్టలో వేస్తోందని అన్ని రాష్టాల్ర సిఎంలు దాదాపుగా అభిప్రాయపడుతున్నారు. కాగితాలపై కేటాయింపులు చేస్తున్నారని.. వాస్తవంగా నిధులు మాత్రం ఇవ్వట్లేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రం తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి ఆయోగ్‌ ‌ప్రవర్తించడం పట్ల కెసిఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలి సమావేశానికి నిరసనగా గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సందేహాలను నివృత్తి చేయాలి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. దేశం యావత్తూ సమస్య కాబట్టి వివరణ సమగ్రంగా ఉండాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply