Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొరోనా ముప్పు లేనట్టే

  • కొత్త వేరియంట్‌ ‌వొస్తేనే థర్డ్‌వేవ్‌
  • ‌స్కూళ్లు తెరిచినా ఇబ్బంది రావడం లేదు
  • పిల్లలకు వైరస్‌ ‌సోకకుండా చర్యలు
  • ఐటి కంపెనీలు ఆఫీసులు తెరుచుకోవచ్చు
  • రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు వెల్లడి

రాష్టలో కొరోనా అదుపులో ఉందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తెరుచుకోవచ్చని అన్నారు. ఐటీ కంపెనీల మిద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని..లక్షలాది మందికి ఉపాధి దొరకాలన్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌ ‌చేస్తున్నారని..కంపెనీలు ఓపెన్‌ ‌చేయడానికి ఇదే సరైన సమయమన్నారు. ఈ మేరకు ఆయన ఐటి కంపెనీలకు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు 2 కోట్ల టీకా డోసులు ఇచ్చామని తెలిపారు. జీహెచ్‌ఎం‌సీలో 100 శాతం టీకాలు ఇచ్చామన్నారు. కొత్త వేరియంట్‌ ‌వస్తే తప్ప థర్డ్ ‌వేవ్‌ ‌రాదని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ ‌చేస్తామని చెప్పారు. పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడొద్దని సూచించారు. మార్చి వరకు థర్డ్ ‌వేవ్‌ ‌వొచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ వొచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని వివరించారు. రాష్ట్రంలో కోవిడ్‌, ‌సీజనల్‌ ‌డీసీస్‌ ‌ప్రస్తుత పరిస్థితి ఏవిధంగా ఉందనేదానిపై ముఖ్యమంత్రి సమిక్ష నిర్వహించారని శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 613 డెంగ్యూ కేసులు నమోదు కాగా, హైదరాబాద్‌లో డెంగ్యూ కేసులు, మలేరియా కూడా అత్యధికంగా నమోదవుతున్నాయన్నారు.

కొత్తగూడెం, ములుగులో ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. 2019 లో డెంగ్యూ కేసులు 4 వేలు రిపోర్ట్ అయ్యాయని, ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 ‌వరకు 3 వేల డెంగ్యూ కేసులు నమోదైయ్యాయని చెప్పారు. వైరల్‌ ‌ఫీవర్స్ ‌కూడా ఈమధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్లేట్‌ ‌లెట్‌ ‌కౌంట్‌ ‌పడిపోతే ప్రైవేట్‌లో జనాలను పరుగులు పెట్టిస్తున్నారని, వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అక్టోబర్‌ ‌నెలాఖరు వరకు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ ‌మినహా మిగతా జిల్లాలో చాలా తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయని, రాష్ట్రంలో 0.4 శాతం మాత్రమే పాజిటివిటీ రేట్‌ ఉం‌టుందన్నారు. తెలంగాణలో కొవిడ్‌ ‌నియంత్రణలో ఉందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. విద్యాసంస్థలు రీ ఓపెన్‌ ‌తర్వాత ఎక్కువ కొవిడ్‌ ‌కేసులు నమోదవుతాయనుకున్నామని చెప్పారు.

కానీ క్లస్టర్‌ ‌బ్రేక్‌ ఎక్కడా చోటు చేసుకోలేదన్నారు. పేరెంట్స్ ‌పిల్లల్ని స్కూల్స్‌కి పంపవచ్చని సూచించారు. ఇప్పటివరకు లక్షా 15 వేల మంది విద్యార్థులకు టెస్ట్ ‌చేస్తే కేవలం 55 మందికి మాత్రమే పాజిటివ్‌ ‌వచ్చిందని వెల్లడించారు. సెప్టెంబర్‌లో పీక్‌ ‌లోకి వెళ్తుందన్నారు. కేసులు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. కానీ మన రాష్ట్రంలో అదుపులో ఉందన్నారు. 27వేల కు పైగా ప్రభుత్వ బెడ్స్ ‌మొత్తం ఆక్సిజన్‌ ‌బెడ్స్‌గా మార్చామన్నారు. భవిష్యత్‌లో ఆక్సిజన్‌ అవసరం ఉంటే మనమే ఉత్పత్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 40శాతం ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌కూడా ఆక్సిజన్‌ ‌ప్లాంట్స్‌తో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో చిన్నారులకు ట్రీట్మెంట్‌ ‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 3600 కు పైగా బెడ్స్ ‌చిన్నారుల కోసం సిద్ధంగా ఉన్నాయన్నారు.

Leave a Reply