Take a fresh look at your lifestyle.

హరితహరంలో తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు : కలెక్టర్‌

నగర హరితహరంలో తప్పులు జరిగితే ఎవ్వరినైన ఉపేక్షించేది లేదని జిల్లాకలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హనుమంతు హెచ్చరించారు. మినీ సమావేశ మందిరంలో నగర హరిత పురోగతి పై నగరపాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతితో కలిసి జిల్లా కలెక్టర్‌ ‌సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ హరిత హరం కార్యక్రమం లో బాగంగా నగర పాలక సంస్థ కు 36 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు ఆశించిన ప్రగతి సాధించలేక వెనకబడి ఉన్న నేపథ్యంలో మొక్కలు నాటే పక్రియను వేగవంతం చేయాలన్నారు. ఒక్కో వార్డులో కనీసం రోజుకు 500ల మొక్కలు నాటినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంతామన్నారు. ఆ విధంగా ఫిట్టింగ్‌ ‌ప్లాంటేషన్‌ ‌ట్రాన్స్పోర్టేషన్‌ ‌పై ప్రణాళిక సిద్దం చేసుకొని లక్ష్యం మేరకు పురోగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ ‌మాదిరిగా నగరం మొక్కలు నాటితే లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మియా వాకీ యాదాద్రి పద్దతిలో దట్టమైన అటవీగా ఉండే విధంగా మొక్కలు నాటి నప్పుడే నగర లక్ష్యాన్ని చేరుకొనే అవకాశం ఉందన్నారు. మొక్కలు నాటడం తో పాటుగా వందకు వంద శాతం సంరక్షించలన్నారు.

కాంపౌండ్‌ ‌వాల్‌ ‌లేనిచోట ట్రీ గార్డు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో 25 మంకీ ఫుడ్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. హెచ్‌ఏం‌డిఎ నుండి కార్పొరేషన్‌ ‌కు 2.80 లక్షల మొక్కలు కేటాయించిన నేపథ్యంలో అక్కడి నుండి వెంటనే వారం రోజుల్లో పూర్తిగా తెప్పించే ఏర్పాట్లు చేయాలని సిహెచ్‌ఓ ‌ను ఆదేశించారు. వార్డు కు శానిటరీ ఇన్స్పెక్టర్‌కు బాధ్యత వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. హోమ్‌ ‌స్టెడ్‌ ‌క్రింద అవసరమైన వారికి అందించి అట్టి మొక్కలు నాటారో లేదో పరిశీలన చేయాలన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ఖాళీ స్థానాలను గుర్తించి అట్టి ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, అందుకు ఎస్సారెస్పీ డిప్యూటీ ఈఈ స్థాయి అధికారిని నోడల్‌ అధికారిగా ఒకరిని నియమించిన కార్పొరేషన్‌ ‌నుండి సిహెచ్‌ఓ ‌సునీత ఇద్దరు కలిసి పరిశీలన చేసి గుర్తించిన ప్రదేశాల్లో యాదాద్రి మోడల్‌ ‌లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో యస్‌ అర్‌ ‌యస్‌ ‌పి యస్‌ ‌సి, తో పాటుగా ఈఈ లు కార్పొరేషన్‌ ‌వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply