Take a fresh look at your lifestyle.

టీకాల కొరత లేదు

  • దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగంగా సాగుతున్నది
  • టీకా తీసుకున్న వారూ కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలి
  • గాంధీలో వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి

దేశవ్యాప్తంగా కొరోనా వాక్సినేషన్‌ ‌వేగంగా సాగుతోందని కేంద్ర సహాయమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. ఎక్కడ కూడా టీకాలకు లోటు లేకుండా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. గాంధీ హాస్పిటల్‌లో ఉన్న వ్యాక్సినేషన్‌ ‌సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా వి•డియాతో  మాట్లాడుతూ.. ‘టీకా తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నాం. దేశంలో రెండు సంస్థలు టీకాను ఉత్పత్తి చేస్తున్నాయి. కోవిషీల్డ్, ‌కోవాక్సిన్‌ అద్భుతంగా ప్రొడక్షన్‌ ‌చేస్తున్నాయి. మన దేశంతో పాటు మరో 58 దేశాలకు భారత్‌ ‌నుంచి ఓ••వ సరఫరా అవుతోంది. ముందుగా మన దేశ ప్రజలకు ఓ••వ ఇవ్వాలని వీలైనన్ని డోస్‌లు అందుబాటులో ఉంచుతున్నాం. ప్రధాని సైతం కోవాక్సిన్‌ ‌తీసుకున్నారు. నేను కోవిషీల్డ్ ‌తీసుకున్నాను. ఏ టీకా అయిన మంచిగానే పనిచేస్తుంది. ప్రజలు ఏదో ఒక రకం టీకా కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్నది తీసుకోవాలి. ప్రభుత్వ టీకా కేంద్రాల్లో టీకాను ఉచితంగా అందిస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్‌ ‌రోగులతో కలిసే అవకాశం లేకుండా హాస్పిటల్‌ ‌వార్డ్‌లకు దూరంగా ఉండేలా టీకా కేంద్రం ఏర్పాటుచేశారు. టీకా తీసుకున్న వారు కూడా తప్పక కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలి. వర్క్ ‌ప్లేస్‌లో, షాపింగ్‌ ‌మాల్స్‌లో మరియు బయటకి వొచ్చినప్పుడు తప్పకుండా కోవిడ్‌ ‌నిబంధనలు పాటించాలి. దేశంలో కోవిడ్‌ ‌కేసులు, కోవిడ్‌ ‌మరణాలు పెరుగుతున్నాయి. ప్రజల సహకారం లేకుండా కోవిడ్‌ని అరికట్టలేం’ అని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.

Leave a Reply