Take a fresh look at your lifestyle.

‌ప్రజా సేవకు మించిన సేవ లేదు

  • పని చేసే వార్డుకు ప్రాధాన్యత – ఆ వార్డులో స్టీల్‌ ‌బ్యాంకు ఏర్పాటు చేస్తా
  • మున్సిపల్‌ ‌సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు

ఇష్టంతో.. మంచిగా పని చేసే వార్డుకు మొదటి ప్రాధాన్యత. ఆ మున్సిపల్‌ ‌వార్డుకు స్టీల్‌ ‌బ్యాంకు ఏర్పాటు చేయిస్తా. ప్రజాసేవకు మించిన సేవ ఇంకేమీ లేదు. ఒక ప్రతి ప్రజానిధిగా వార్డు పరిశుభ్రతతో పాటు ప్రజా ఆరోగ్యం కాపాడేందుకు పాటుపడుదాం.ప్రతీ మున్సిపల్‌ ‌వార్డులోని మెప్మా ఆర్పీ, అంగన్‌ ‌వాడీ టీచర్‌, ఆశా వర్కర్‌, ‌పోలీసు కానిస్టేబుల్‌, ‌సీనియర్‌ ‌సిటిజన్‌, ‌రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్ల సమన్వయంతో వార్డును పరిశుభ్ర, ఆరోగ్య వార్డుగా తీర్చిదిద్దుదామని వార్డు కౌన్సిలర్లు, ఆర్పీలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్‌ ‌కార్యాలయంలో సోమవారం రెండవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రత పై మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌రాజనర్సు అధ్యక్షతన కౌన్సిలర్లకు, ఆర్పీలకు, మున్సిపల్‌ ‌సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హరీశ్‌ ‌రావు హాజరై పట్టణ పరిశుభ్రతకు చేపడుతున్న, చేపట్టాల్సిన అంశాలపై మున్సిపల్‌ ‌కౌన్సిలర్లకు, ఆర్పీలకు, మున్సిపల్‌ ‌సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న వర్షాకాల దృష్ట్యా సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా.. మున్సిపల్‌ ‌వార్డుల్లోని మోరీల్లో, చెత్త తీయాలని సూచించారు. ఏ వార్డులో వర్షపు నీరు పొంగి ప్రవహించొద్దని, రోడ్లపైకి నీళ్లు రాకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద నీరు మురికి కాల్వల్లో వెళ్లేలా.. చూడాలని కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.మన సిద్ధిపేటను బాగు చేసుకునేందుకు ఒక్క అడుగు ముందేసి పని చేద్దామని ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపు నిచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దేలా ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడా చేయని పనిని దూరదృష్టితో చేపట్టినట్లు మంత్రి వివరించారు. మంచి సంకల్పంతో బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ‌శాంతి పట్టణ ప్రజల పరిశుభ్రత, ఆరోగ్యం కోసం చేస్తున్న సేవలను కొనియాడారు.ప్రతీ మంగళవారం, శుక్రవారం పొడి చెత్త, ప్రతీ సోమవారం, బుధవారం, గురువారం, శనివారం తడి చెత్తను మున్సిపాలిటీ సేకరిస్తున్నదని, ప్రతీ ఆదివారం డ్రై డే నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.

మొదటి దశలో మున్సిపల్‌ ‌పరిధిలోని 34 వార్డుల్లో 1, 4, 10, 12, 22, 33వ మున్సిపల్‌ ‌వార్డులు తడి, పొడి, హానికరమైన చెత్తలను వేర్వేరుగా చేసి ఇవ్వడంలో మొదటి స్థానంలో నిలిచారని., మొదటి దశలోని 6 వార్డుల్లో పరిశుభ్రత పాటించడం, తడి, పొడి, హానికర చెత్త అవగాహన వచ్చి క్రమంగా మార్పు చెందుతున్నాయని ఆ వార్డు కౌన్సిలర్లను మంత్రి అభినందించారు.ఈ వార్డుల్లో చేపడుతున్న తరహాలోనే మిగతా వార్డు కౌన్సిలర్లు, ఆ వార్డు ఆర్పీలు ముందుకొచ్చి పట్టణ పరిశుభ్రత, ప్రజా ఆరోగ్య భద్రతలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు.
ప్రభుత్వం స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టినప్పటికీ బాధ్యతగా మనం చేయాల్సిన పని కూడా ప్రజాప్రతినిధులుగా చేయడానికి ముందుకు రావాలని కోరుతూ.. ప్రజాసేవకు మించిన సేవ ఇంకేమీ లేదని., ఒక ప్రతి ప్రజానిధిగా ప్రజా ఆరోగ్యం కాపాడేందుకు పాటుపడుదామని కౌన్సిలర్లకు మంత్రి హరీశ్‌ ‌పిలుపునిచ్చారు.

సిద్ధిపేట మున్సిపాలిటీలో రోజుకు 30 వేల కిలోల చెత్త ఉత్పత్తి అవుతున్నదని, నెలకు 9 లక్షల కిలోల చెత్త ఉత్పత్తి జరుగుతున్నదని.. చెత్త పేరుకుపోకుండా ఏం చేద్దామనే.. విషయాన్ని.. మనం ప్రజల దగ్గరికి తీసుకు వెళ్దామని.. ప్రతి వార్డులో ఇంటింటా తడి, పొడి, హానికర చెత్త గురించి అవగాహన కల్పించాలని మంత్రి కోరారు.
అంతకు ముందు తడి, పొడి, హానికరమైన చెత్త గురించి బెంగళూరుకు చెందిన ప్రముఖ డాక్టర్‌ ‌శాంతి సవివరంగా అవగాహన కల్పించారు. ఈ మేరకు 31వ, 28వ, 26వ, 13వ వార్డు కౌన్సిలర్లు వార్డు పరిశుభ్రత, ఆరోగ్య వార్డుగా తీర్చిదిద్దుతామని ముందుకొచ్చారు. ఈ సమావేశంలో పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, మెప్మా ఆర్పీలు, శానిటేషన్‌ ‌విభాగం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply