Take a fresh look at your lifestyle.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు

  • గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది
  • దేశంలో పరివర్తన రాజకీయాలు అవసరం
  • 8 ఏళ్లలో ఏవి•చేయలేడని నిరూపించుకున్న మోడీ
  • ప్రజల సమస్యల పరిష్కారంలో బిజెపి విఫలం
  • అయితే డిమానిటైజేషన్‌..‌లేదంటే మానిటైజేషన్‌
  • ‌ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌పైసా తీసుకోకుండా సాయం చేస్తున్నారు
  • ప్రత్యామ్నాయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తా
  • యూపి,ఉత్తరాఖండ, గోవా,పంజాబ్‌ ‌ఫలితాల్లో పడిపోయిన ప్రభ
  • వి•డియా సమావేశంలో సిఎం కెసిఆర్‌ ‌వెల్లడి

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సిఎం కెసిఆర్‌ ‌మరోమారు స్పష్టం చేశారు. గతంలో తాము చేపట్టిన పనులు పూర్తి చేయాలంటే మళ్లీ అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఎన్నికలకు వెళ్లామని అంటూ..ముందస్తు  ఊహాగానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టతను ఇచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్‌ ‌వి•డియాతో మాట్లాడారు.గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండిందని, మేం ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉండే. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. పాలమూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడను. కేసీఆర్‌ ఎప్పు‌డు మోసం చేయడు.. ఏం చెప్పినామో అదే చేస్తాం. చెప్పిందే చేస్తామని అన్నారు. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఇప్పుడు 95-105 సీట్ల మధ్య గెలుస్తాం. 25 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను.. దాని చూస్తే వి•రే ఆశ్చర్య పడుతారు. నిన్ననే ఒక లేటెస్ట్ ‌రిపోర్టు వచ్చింది. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్‌ ‌తెలిపారు. ఇకపోతే జాతీయ రాజకీయాల్లో కెసిఆర్‌ ‌నిర్మాణాత్మకపాత్ర పోషిస్తారని అన్నారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలం అయ్యారని అన్నారు. 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పనిని మోడీ చేయలేకపోయారని అన్నారు. అందుకే ప్రజలు క్షేత్రంగా పరివర్తన రాజకీయాలు రావాల్సి ఉందన్నారు. అందుకు ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌సాయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్‌ ‌కిశోర్‌తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వి•డియాను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌టీఆర్‌ఎస్‌ ఎన్నికల కోసం పని చేస్తున్నాడా అని ఓ వి•డియా ప్రతినిధి కేసీఆర్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. కి

శోర్‌ ‌తమతో కలిసి పని చేస్తుండు.. అది తప్పా.. ఆయన ఏమైనా రహస్యమా. ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌తనతో కలిసి పని చేస్తడు. దేశం గురించి ఆలోచన చేసినప్పుడు తెలంగాణ అంతర్భాగమే కదా గత 8 ఏండ్ల నుంచి కిశోర్‌ ‌తనకు మంచి స్నేహితుడు. ఆయన పైసల కోసం పని చేయడు. దేశం కోసం ఆయన చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. ఆయన పైసల కోసం పని చేస్తున్నట్లు వి• దగ్గర రిపోర్టు ఉందా? బీజేపీకి, జగన్‌కు, మమతకు పని చేసిండు. 12 రాష్టాల్రతో పాటు దేశానికి పని చేసిండు.. దేశ రాజకీయాల వి•ద అవగాహన ఉంది కాబట్టి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి కిశోర్‌ను నేనే పిలిచాను. బ్రహ్మాండంగా పని చేస్తున్నాం. 100 శాతం ఆయన చిత్తశుద్దితో పని చేస్తున్నారు. ఆయన ఎన్నో దేశాల్లో పని చేశారని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు.  ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాల్సిందేనని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ -‌రష్యా యుద్ధం కారణంగా 20 వేల మంది పిల్లలను స్వదేశానికి తీసుకురావడానికి కూడా ఇబ్బందులు పడ్డారు. తద్వారా విద్యార్థులు అనేక బాధలు అనుభవించారు. విద్యార్థుల తల్లిదండ్రులు మానసిక వ్యధ అనుభవించారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన మెడికల్‌ ‌విద్యార్థులను తామే చదివిస్తామని ప్రకటించాం. ఆ తర్వాత బెంగాల్‌ ‌కూడా ప్రకటించింది. కేంద్రం నుంచి మాత్రం ఉలుకు లేదు.. పలుకు లేదు. దేశంలో అభివృద్ధి లేదు. జీడీపీ పెంచేదిలేదు. ఆర్థిక వృద్ధిని పెంచలేదు. భయంకరమైన ఇండెక్స్ ఉన్నాయి.

యూత్‌ ‌నిరుద్యోగ ఇండెక్స్‌లో లాస్ట్ ‌ర్యాంకులో ఉన్నాం. 20.84 ర్యాంకులో ఉన్నాం. సిరియా కంటే అధ్వాన్నంగా ఉన్నాం. అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో తిరోగమనంలో ఉందని కేసీఆర్‌ ‌తెలిపారు. బిజెపి పార్టీ తీసుకొచ్చే దుర్మార్గ విధానాలను తిప్పికొట్టాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలి. కేంద్ర వ్యతిరేక ఉద్యమాలను కూడా నిర్వహిస్తాం. కేంద్రం చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఇవ్వలేదు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల ఖాళీలను భర్తీ చేయాలని ధర్నా చేస్తాం. ధాన్యం వద్దే ఆగిపోము. రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీస్తాం. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం కంటే ఎక్కువ ఉండొద్దని రాజ్యాంగంలో లేదు. ప్రత్యేక పరిస్థితులు సంభవిస్తే 50 శాతం అధిగమించొచ్చని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఇచ్చింది. దీనిపై శాసనసభ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. ఈ తీర్మానంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ వర్గీకరణపై కూడా తీర్మానం చేసి పంపించాం. దాని వి•ద కూడా అతిగతి లేదు. బీసీల కులగణను పట్టించుకోవడం లేదు. విద్వేషాలు సృష్టించి, ఉద్వేగాలకు లోను చేసి వాటిని రాజకీయంగా ఉపయోగించుకునే దుర్మార్గం నెలకొని ఉంది. దీని వల్ల దేశ అభివృద్ధి కుంటు పడుతుంది. దేశంలో అనేక భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రగతిశీల విధానంలో పని చేసే ప్రభుత్వం రావాలి అని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తనపై ఈడీ దాడులకు దిగినా భయపడనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇలాంటివి అన్నిచోట్ల పనిచేయవు. బోడి బెదిరింపులకు భయపడమని అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తాన ప్రయత్నాలని అన్నారు.

ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బీజేపీకి ఉద్యోగాలివ్వడం తేలీదు. పోగ్రెసివ్‌ ‌పాలిటిక్స్ ‌చేయడం లేదు. యూపీయే ప్రభుత్వం బాగాలేదని బీజేపీకి అధికారం ఇస్తే అంతకంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యాయి. నిరుద్యోగుల రేటు బాగా పెరిగింది. జీడీపీ తగ్గింది. రెండు మూడు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సామర్ధ్యం ఇదే అని కేంద్రం చెప్పుకుంది. ఒక్క ఫ్యాక్టరీ పెట్లలేదు. వున్నవి అమ్మేస్తున్నారు. అయితే డీమానిటైజేషన్‌.. ‌లేదంటే మానిటైజేషన్‌ ‌చేసుకోవా లంటున్నారు. పంచాయితీ రాజ్‌ ఆస్తులు మోనిటైజ్‌ ‌చేసుకోమంటున్నారు. రాజకీయంగా చాలా దారుణమ యిన పరిస్థితులున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్‌ ‌లో బీజేపీ బలం తగ్గుతోంది. ఇది స్పష్టమయిన పరిస్థితి. దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. 8 ఏళ్ళు గడిచింది. బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి చేయాలి. మంచి ఆవిష్కరణలు జరగాలి. ఇది ఎంతో ఎక్కువ టైం. ఒక ప్రాజెక్ట్ ‌కట్టలేదు. దేశం బాగుపడాలంటే.. ఈ ప్రభుత్వం పోవాలని నిర్ణయానికి వచ్చామన్నారు. ఈ నెల 28,29 న జరిగే ట్రేడ్‌ ‌యూనియన్ల ఆందోళనకు టీఆర్‌ఎస్‌ ‌మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్‌ ఎల్పీలో సుదీర్ఘ చర్చ జరిగింది.

Leave a Reply