Take a fresh look at your lifestyle.

చర్చలు జరిపేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు

  • ఢిల్లీ అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌
  • మద్దతు ధర చట్టం చేసి, విద్యుత్‌ ‌సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
  • కిసాన్‌ ‌సంయుక్త మోర్చా జాతీయ నేత రాకేశ్‌ ‌టికాయత్‌
  • ‌రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించిందనే కేసీఆర్‌ ‌రైతు రంగు పూసుకున్నారు
  • యూపీ,పంజాబ్‌,ఉత్తరాఖండ్‌,‌గోవాలో బీజేపీని ఓడించి గుణపాఠం చెప్తాం
  • ఏఐకేఎంఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి అతుల్‌ ‌కుమార్‌ అం‌జన్‌
  • ఇం‌దిరాపార్కు వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి రైతు మహాధర్నా

ముషీరాబాద్‌, ‌నవంబర్‌ 25 (‌ప్రజాతంత్ర విలేఖరి) : ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నడుపుతున్న అప్రజాస్వామిక ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం అని కిసాన్‌ ‌సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ ‌టికాయత్‌ అన్నారు. ప్రభుత్వం తమతో చర్చలు జరిపేంత వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మద్దతు ధర చట్టాన్ని చేసి, విద్యుత్‌ ‌సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు రైతు చట్టాల రద్దును ఆహ్వానిస్తూ కనీస మద్దతు ధర చట్టం కోసం రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఇందిరాపార్కు వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా చెపట్టారు. రైతు సంఘాల రాష్ట్ర కార్యదర్శులు పశ్య పద్మ, సాగర్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కిసాన్‌ ‌సంయుక్త మోర్చా నేత రాకేశ్‌ ‌టికాయత్‌ ‌మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రభుత్వం ఉంటే చట్టం చేసేముందు రైతులను సంప్రదించేంది కానీ మోడిది కంపెనీల ప్రభుత్వం అని విమర్శించారు. దేశంలో సంవత్సరం పాటు జరిగింది కేవలం రైతు ఉద్యమం మాత్రమే అన్నారు. సంప్రదింపుల సమయంలో రైతులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు పీఎంఓ నుండి వచ్చేవన్నారు. చర్చల సమయంలో మేము రూమ్‌ ‌లో చర్చించుకొని మాట్లాడితే వాళ్ళు బయటకు వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులతో మాట్లాడి వస్తున్నారన్నారు. నాగ్‌ ‌పూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆఫీస్‌ ‌వాళ్ళు మీడియాను కూడా ఎక్కు పెట్టారన్నారు. రైతులతో సంప్రదింపులు చేయడం నేరమా అని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వారిని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారన్నారు. భారత ప్రభుత్వం వేసే కమిటీలో రైతు సంఘాలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఉండేలా ఆ కమిటీ సంప్రదింపులు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు వారి వ్యాపారాలకు సహకరిస్తుందన్నారు. తెలంగాణ పార్టీ బీజేపీకి కొమ్ముకాసే పార్టీ వారిని తెలంగాణ దాటి బయటకు పంపించకూడదన్నారు. ఆదివాసీ సమస్యల పరిష్కరించుకోవాలన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యపై అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకునే విధంగా రైతుల బాధ్యతను అందరూ తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతులకు కూడా ప్రభుత్వం సహాయం చేయాలన్నారు. బీజేపీకి టీఆర్‌ఎస్‌ ‌బీ పార్టీ అని, బీజేపీకి కొమ్ముకాసే టీఆర్‌ఎస్‌ ‌ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీని తెలంగాణలో మాత్రమే ఉంచలన్నారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామన్నారు. రైతు ఉద్యం ఒక ప్రాంతానిది కాదని 23 పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో పాలకు ఎమ్‌ఎస్పీ కోసం పోరాడుతామన్నారు. ఆత్యహత్య చేసుకున్న రైతులకు నష్ట పరిహారం కేంద్రం ఇస్తోందో లేదో చెప్పాలన్నారు. పంటకు ఎమ్‌ఎస్పీ గ్యారంటీ కార్డ్ ‌వచ్చే వరకు పోరాడుతాఅన్నారు. ఫెస్టిసైడ్స్ ‌బిల్లు, విత్తన బిల్లు, విద్యుత్‌ ‌బిల్లులు వెనక్కి తీసుకోవాలన్నారు.

Raitu Mahadharna Coordinating Committee of Farmers Associations at Indira Park

ఏఐకేఎంఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి అతుల్‌ ‌కుమార్‌ అం‌జన్‌, ‌స్వామినాథన్‌ ‌కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేశంలో ఉన్న మేధావులు, చలన చిత్ర పరిశ్రమ, వివిధ రంగాలకు సంబంధించిన వారి నుండి రైతులకు మద్దతు లభించిందన్నారు. రైతు పోరాటానికి 23 దేశాల ప్రజలు రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చారన్నారు. అక్కడ కూడా పోరాడారని ఇది ప్రపంచంలోనే అద్భుతమైన పోరాటం అన్నారు. రైతు చేపట్టిన ఈ ఆందోళనకు 70 ఏళ్లలో ఏ ఆందోళన కు ఇంతపెద్ద మద్దతు లభించలేదన్నారు. ఇది రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం, దేశ ఐక్యతకు భంగం చేసే శక్తులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అన్నారు. ఈ ఉద్యమంలో ఎంతో మంది రైతుల బలిదానానాలు జరిగాయాన్నారు. స్వామినాథన్‌ ‌కమిటీలో కాంట్రాక్టు వ్యవసాయాన్ని వ్యతిరేకించారన్నారు. రైతులకు మద్దతు ధర ఖర్చు పెట్టిన దానికి 50 శాతం అదనంగా ఇచ్చి చట్టం చేయాలని స్వామినాథన్‌ ‌కమిటీ లో తెలిపారన్నారు. వ్యవసాయ రంగాన్ని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ ‌శక్తుల చేతిలో పెడితే ఉపేక్షించమన్నారు. కేవలం 3 చట్టాల బిల్లు రద్దు కోసం మాత్రమే ఉద్యమించలేమని, కనీస మద్దతు ధర చట్టం తేవాలన్నారు.

విద్యుత్‌ ‌సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యుత్‌ ‌రంగ సంస్థలు అంబానీ, గౌతమ్‌ ఆధాని చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్‌ ‌సంస్థలకు మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందన్నారు. కేసీఆర్‌ ఎవరి వైపు ఉన్నావ్‌? ‌కేంద్ర ప్రభుత్వంకి ఎందుకు భజన చేశావ్‌? అని ప్రశ్నించరు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంత కష్టపోయాడుతున్నారని, దీనికి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రంగు పూసుకుంటుందన్నారు. కేసీఆర్‌ ‌రైతు పక్షాన ఉంటే వచ్చే సమావేశాల్లో రైతుల పక్షాన పాల్గొనాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించిందనే కేసీఆర్‌ ‌రైతు రంగు పూసుకున్నారన్నారు. తమ పోరాటం జాతి కోసం అన్నారు. గ్రామాలను, రైతులను రక్షించాలన్నారు.

Raitu Mahadharna Coordinating Committee of Farmers Associations at Indira Park

యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ‌గోవా ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఎఐకెఎస్‌ ‌కన్వీనర్‌ ‌కన్నం మొల్ల మాట్లాడుతూ రైతులు తమ హక్కుల సాధన కోసం పోరాటం సాగించారన్నారు. మోదీ ప్రభుత్వం అర్ధరాత్రి దోచుకునే ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను ఆమోదించమని రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారన్నారు. పార్లమెంట్‌ ఎం‌పిలను బెదిరించి వారి అవకాశం లేకుండానే వ్యవసాయ చట్టాలను ఆమోదించుకుందన్నారు. విద్యుత్‌ ‌సవరణ చట్టం వల్ల మరింత భారం పెరుగుతుందన్నారు. రైతులు ఢిల్లీకి రాకుండా అడ్డుకున్నారని, ఢిల్లీకి రాకుండా అడ్డుకోవడానికి ఇది ఎవరి జాగిరీ కాదన్నారు. మోదీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ఒక నాటకం అన్నారు. ఏ చట్టాలు మంచో ఏది కాదో రైతులకు తెలుసన్నారు. చట్టాల పెరు చెప్పి రైతుల పొలాలను ఆధాని అంబానీలకు అమ్మలని చూసారన్నారు.

హన్నం మొల్ల మాట్లాడుతూ రైతులు 750 మంది కాదు 7000 మంది చనిపోయిన పోరాటం కొనసాగించేవారన్నారు. ముఖ్యమంత్రిల కమిటీకి మోదీ చైర్మన్‌ ‌గా ఉన్నారని, ఆ సమయంలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆ సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ ‌సింగ్‌ ‌కి నివేదిక ఇచ్చారన్నారు. దానిని బహిర్గతపర్చాలన్నారు. కనీస మద్దతు ధర చట్టం వచ్చే వరకు సమస్య పరిష్కారం కాదన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎఐకెఎంఎస్‌ ఆశిష్‌ ‌మిట్టల్‌ ‌మాట్లాడుతూ 3 రైతు వ్యవసాయ చట్టాలు ప్రజలకు రైతులకు నష్టాలు తెచ్చే విధంగా ఉండేవన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌ను ప్రోత్సహించే విధంగా నిత్యవసర వస్తువుల చట్టం ఉందన్నారు. కౌలుదారు హక్కులు రద్దైయ్యే అవకాశం ఉందన్నారు. మన భూములు కార్పొరేట్‌ ‌లకు తాకట్టు పెట్టేవిధంగా ఉన్నాయన్నారు. బీజేపీ దేశ ప్రజల వ్యతిరేకి సంస్కృతి పేరుతో విభజన చేయాలనీ ప్రయత్నం చేసిందన్నారు. రైతులను నాశనం చేసి కార్పొరేట్‌ ‌సంస్థల అభివృద్ధి చేయాలనీ చూసిందన్నారు. కరోన సెకండ్‌ ‌వేవ్‌ ‌సమయంలో హర్యానా రైతులపై కేసులు నమోదు చేశారన్నారు. పంజాబ్‌ అసెంబ్లీలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తరువాత పోరాటాలు చేయడానికి వీధుల్లోకి వచ్చారన్నారు. చలో ఢిల్లీ పిలుపునిచ్చారు. మేము ఎక్కడ రోడ్లు దిగ్బంధం చేయలేదని సుప్రీం కోర్ట్ ‌కి చెప్పిందన్నారు. మద్దతు ధర చట్టం చేయడంతో పాటు విద్యుత్‌ ‌సవరణ చట్టం ను రద్దు చేయాలన్నారు. తెలంగాణ లో ఆదివాసీ ఉద్యమం బలపడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్‌, ‌హన్నన్‌ ‌మెల్లా, ఏఐకేఎంఎస్‌ ‌నేతలు జీఎస్‌ ఆశిష్‌ ‌మిత్తల్‌, ‌భూమి బచావో ఆందోళన్‌ ‌నేత జగ్తార్‌ ‌బాజ్వా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply