- 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తింపు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
- 24 గంటల్లో 1,076 కేసులు ప్రస్తుతం భారత్‌లో 11,439 పాజిటివ్ కేసులు
దేశంలో కొరోనా సామూహిక వ్యాప్తి లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కొరోనా హెల్త్‌బులెటిన్‌ను కేంద్రం విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 1,076 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 377 మంది చనిపోయారు. కరోనా నుంచి 1,306 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 11,439 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ’నాన్ హాట్‌స్పాట్స్ ఏరియాల్లో ఈనెల 20 నుంచి దశలవారీగా ఆంక్షలను క్రమంగా సడలిస్తాం. దేశవ్యాప్తంగా హాట్‌స్పాట్స్ కోసం గైడ్‌లైన్స్ విడుదల చేశాం. దేశంలోని జిల్లాలను హాట్‌స్పాట్స్, నాన్హాట్స్పాట్స్, గ్రీన్ జోన్లుగా విభజించాం. దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్స్ జిల్లాలను గుర్తించాం. కంటైన్మెంట్ ప్రాంతాలపై ఇప్పటకే రాష్టాల్రకు స్పష్టతనిచ్చాం. హాట్‌స్పాట్స్ ఏరియాలో ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం. అన్ని రాష్టాల్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామని’ కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొరోనా కేసులు అధికంగా ఉన్న 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ హాట్‌స్పాట్స్‌ను, గ్రీన్‌జోన్స్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడతున్నామని ఆరోగ్య మంత్రత్వి శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కంటెయిన్మెంట్ జోన్లలో నిత్యావసర సేవలు మినహా రాకపోకలను పూర్తిగా నిలిపివేశామని చెప్పారు.
ఇంటింటి సర్వే చేపడతామని తెలిపారు. తాజా కొరోనా వైరస్ కేసుల కోసం ప్రత్యేక
బృందాలు పనిచేస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తాయని పేర్కొన్నారు. కరోనా రోగుల కోసం కోవిడ్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 1076 నూతన కేసులు వెల్లడవగా, 38 మంది మరణించారని చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.