Take a fresh look at your lifestyle.

మోడీ ,షా ల పరస్పర అవగాహనలో తేడా లేదు

There is no difference in the mutual understanding of Modi and Shah

నిన్నమొన్నటి వరకూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయానికి విజయాలను సాధించే జంటగా మంచి పేరుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ మారిపోయింది. భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిగా అమిత్ షా పార్టీని విజయతీరాలకు తీసుకుని వెళ్ళే నాయకునిగా పేరొందారు .ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్ష పదవిని విడిచి పెట్టి కేంద్ర హోం మంత్రి పదవి ఒక్కటి మాత్రమే అట్టిపెట్టుకున్నారు. హోం మంత్రిగా అమిత్ షా విజయాన్ని బట్టి మోడీ- షా ద్వయం విజయాలు సాధించే జంటగా పేరు కొనసాగుతుంది. దేశ రాజకీయాల్లో నెహ్రూ, పటేల్, ఆ తర్వాత వాజ్ పేయి, అద్వానీ లకు అలాంటి పేరుండేది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అమిత్ షా తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని దశకు చేరుకున్నారు. ఈ ఎన్నికలకు కొద్ది వారాల ముందే ఆయన పార్టీ అధ్యక్ష పదవిని జెపి నడ్డాకు అప్పగించారు.అప్పటి వరకూ జెపీ నడ్డా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు. నడ్డా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టగానే ఈ చేదు అనుభవం ఎదురైంది. నిజానికి ఈ విషయంలో ఎవరిది బాధ్యత అంటే చెప్పలేం. 73 ఏళ్ళ స్వతంత్ర భారత దేశంలో మోడీ అమిత్ షా ద్వయం ఎన్నో విజయాలను సాధించారు. మరిన్ని సాధించేందుకు ఆశతో ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ఫలితాలు బ్రేక్ వేశాయి. అయితే నెహ్రూ- పటేల్, వాజ్ పేయి- అద్వానీల మాదిరిగా ఈ ద్వయం సమానులు కారు. వీరి రాజకీయ నేపధ్యాలు ఒకటే అయినా, ఆలోచనా విధానాలు వేరు. చరణ్ సింగ్ నుంచి ఐకే గుజ్రాల్, వీపీసింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ వీరంతా నాయకత్వ ప్రస్తావన లేకుండానే తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా అధికారాన్ని చేపట్టారు.

భారతీయ జనతాపార్టీకి సంబంధించి అటల్ కీ అద్వానీకీ మధ్య ఉన్న సంబంధాలు మోడీ, షాలకు లేవు. అంతరాలు ఉన్నాయి. ఆలోచనా విధానాల్లో కూడా. వీరిద్దరూ ప్రభుత్వంలోనూ, అంతకుముందు పార్టీ, పరివార్ పదవుల్లో కలిసిమెలిసి నడిచారు. వారి మద్య వ్యక్తిగత స్నేహం ఉండేది,. పరస్పర అవగాహనతో పని చేశారు., అద్వానీ హిందుత్వ ఇమేజ్ తో పార్టీని విజయతీరాలకు నడిపించేవారు.ఇందులో అనుమానం లేదు. వాజ్ పేయి ప్రజాకర్షణ కలిగిన వారు.అయినప్పటికీ అద్వానీని ఎంతో గౌరవించేవారు. వారి మధ్య కలతలు ఉండేవేమో తెలియదు.కానీ, కలిసి పని చేసిన ద్వయంగా ప్రసిద్ధులు,. బాబ్రి మసీదు కూల్చివేత తర్వాత ఇద్దరి మధ్య కొంత మేరకు కలత వచ్చినప్పటికీ, అంతిమంగా అద్వానీ మాటను ఆయన ఎన్నడూ కాదనలేదు. ఇద్దరూ ఒకే మాట పై నడిచేవారు. వాజ్ పేయి ప్రధానమంత్రి గా వ్యవహరించినప్పటికీ అసలైన అధికారం అద్వానీ చేతుల్లో ఉండేది. ఇందుకు ఉదాహరణ తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన జశ్వంత్ సింగ్ ను కేబినెట్ లోకి తీసుకోవడానికి వాజ్ పేయి చాలా కాలం ఆగాల్సి వచ్చింది. మళ్ళీ సోనియా- మన్మోహన్ ల హయాంలో పరిస్థితి వేరు., మన్మోహన్ సమానుల్లో మొదటి వారు కారు.ఆయన ఎన్నడూ స్వతంత్రంగా వ్యవహరించలేదు. సోనియా ఆదేశాల మేరకే పని చేసేవారు.

మోడీ, అమిత్ షాలు భిన్నమైన కేటగిరికి చెందిన వారు. వారు సమానంగా ఉన్నట్టు కనిపిస్తారు. కలిసి నడుస్తున్నట్టు కనిపిస్తారు. అయితే, వారు విభేదించుకోవడం కూడా మామూలే., ఉదారంగా ఒకరు, కఠినంగా మరొకరు ఉన్నట్టు కనిపిస్తారు. పటేల్, నెహ్రూలు అనేక విషయాల్లో విభేదించుకునే వారు. వాజ్ పేయి, అద్వానీలు కూడా అంతే, నిజానికి 2004 లో ఎన్నికలు ముందుకు జరపడం వాజ్ పేయికి ఇష్టం లేదు. కానీ, పార్టీ నిర్ణయాన్ని ఆయన గౌరవించారు. కొత్త బీజేపీని నిర్మించడంలో హిందుత్వ వాదాన్ని వ్యాపింపజేయడంలో అద్వానీ కీలక పాత్ర పోషించిన దృష్ట్యా ఆయన పై చేయి ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది. గుజరాత్ అల్లర్ల తర్వాత మోడీని వాజ్ పేయి తొలగిద్దామనుకున్నారు. అద్వానీ అంగీకరించలేదు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా గుజరాత్ హోం మంత్రిగా ఉండేవారు.అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది ఆ అవగాహనతోనే నేటికీ పని చేస్తున్నారు. మోడీ నీ, తననూ చంద్రగుప్త మౌర్య, కౌటిల్యుల మాదిరిగా పోల్చవద్దని అమిత్ షా అన్నారు. మోడీతో తన ప్రయాణం ఎటువంటి అరమరికలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా సాగుతోందని ఆయన అన్నారు. అమిత్ షా అభిప్రాయాలను మోడీ గౌరవిస్తున్నారు. ఇద్దరి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు ఇంతవరకూ రాలేదు. వారిద్దరూ జంటగా ఎన్నో విజయాలను సాధించారు. జార్ఖండ్ లో కానీ,డిల్లీలో కానీ ఓటమిలకు ఎన్నో కారణాలు ఉంటాయి. మోడీకి చెప్పకుండా అమిత్ షా ఏ కార్యక్రమం చేపట్టడం లేదు. అందువల్ల హోం మంత్రిగా అమిత్ షా తీసుకునే ప్రతి నిర్ణయానికి మోడీ ఆమోదం ఉంటుందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మోడీ, షాలు రెండు దశాబ్దాల నుంచి కలిసి నడుస్తున్నారు.ఒకరు జనాదరణ ,జనాకర్షణ కలిగిన నాయకుడు, మరొకరు రాజకీయఎత్తుల వేయడంలో దిట్ట . వాజ్ పేయి, అద్వానీలు వయసులో కొంచెం ఇంచుమించుగా సమానంగా ఉండేవారు మోడీ,అమిత్ షాల మధ్య 14 ఏళ్ళ తేడా ఉంది.అందువల్ల వయసు రీత్యా అమిత్ షా మోడీకి సహచరునిగానే ఉంటారే కానీ, అనుచరునిగా ఉండలేరు. ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఉంది. మోడీ ఏది చెబితేఅది శిరోధార్యంగా అమిత్ షా పని చేస్తున్నారు.అందువల్ల మోడీ షాల మధ్య అంతరాల్లో తేడా ఉండవచ్చు అవగాహన లో ధోకా లేదని చెప్పవచ్చు

సీనియర్ ఎడిటర్ శేఖర్ గుప్తా , ది ప్రింట్ సౌజన్యం తో

Leave a Reply