Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు..

కేటీఆర్ ప్రగతి భవన్ రోడ్లెందుకు మూసివేశారు…?: ఎంపీ అర్వింద్
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,మార్చి 17: హైకోర్టు ఆదేశించినా బిజేపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానివ్వలేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని ఎంపి ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈటెల రాజేందర్ గెలుపును కేసిఆర్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. వెయ్యి కోట్ల నల్లధనం, నాలుగు వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ కు చెంప చెల్లుమనిపించారని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. నాయకులకు పోయే కాలం వచ్చినప్పుడే ఇలాంటి మతిస్థిమితం లేని నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ కొందరు నేతలు ఇలాంటి నిర్ణయాలతో అధికారం కోల్పోయారని వివరించారు. బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించడం కేసిఆర్ అహంకారానికి  నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కప్పుడు మంచి పేరు ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ కు ఆయన పూర్తిగా బానిసై, డ్యాన్స్ చేస్తున్నారన్నారు. బాన్సువాడలో స్పీకర్ కుటుంబీకుల అఘాయిత్వలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా నడుస్తోన్న దిక్కుమాలిన అసెంబ్లీలో రికార్డ్ లో లేకపోయినా, ప్రజల రికార్డుల్లో ఎక్కిస్తామన్నారు. ఇందిరా పార్క్ లో బిజేపి ఎమ్మెల్యేలు చేపట్టిన ప్రజా పరిరక్షణ దీక్షకు ఆయన మద్దతు తెలిపారు.
కేటీఆర్ పింక్ బుక్ రాస్తున్నవా?
కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి సెక్రటేరియట్ పోనికి కంటోన్మెంట్ లో రోడ్లు వెడల్పు కావని, అక్కడ కాన్వాయ్ ఎల్లంగనే ఇక్కడ గేట్లు ఓపెన్ చేయరని అర్వింద్ అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఐఎస్ఓ, డీఆర్ డిఓ వంటి అనేక రక్షణ సంస్థలు కంటోన్మెంట్ లో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్మీ పై ఉందన్నారు. దేశంలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధానుల ప్రోటోకాల్స్  బ్లూ బుక్ లో ఉంటాయని, ఇతర వీవీఐపీల ప్రోటోకాల్స్ యెల్లో బుక్ ఉంటుందన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని  తిరిగి రాస్తా అన్నట్లు, ప్రోటోకాల్స్ కు సంబంధించి కేటీఆర్ పింక్ బుక్ రాస్తున్నావా? అని అర్వింద్ ప్రశ్నించారు. ఆర్మీని క్వశ్యన్ చేస్తోన్న కేటీఆర్… ముందు కేసీఆర్ ప్రగతి భవన్ రోడ్లు ఎందుకు క్లోజ్ చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లేసిన ప్రజల్నే కేసీఆర్ కలవనివ్వడం లేదన్నారు. ప్రగతి భవన్ కు  భారీ గోడలు, ఫెన్సింగ్, పెద్ద పెద్ద గేట్లు ఎందుకని ప్రశ్నించారు. అదే ప్రగతి భవన్ గత సిఎంలు ప్రజల్ని రోజు కలిసేవారన్నారు. గడ్డ కట్టే చలిలో సరిహద్దుల్లో డ్యూటీ చేస్తోన్న జవాన్లకు కరెంటు, వాటర్ ఎవరు ఇవ్వలేదన్నారు. అలాగే, కంటోన్మెంటో లోనూ వారికి ఎవరో ఈ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి భారతీయుడు ఆర్మీ కి కావాల్సింది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Leave a Reply