Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొరోనా సెకండ్‌వేవ్‌ ‌లేదు

వ్యాక్సిన్‌ ‌విషయంలో వదంతులు నమ్మొద్దు మంత్రి ఈటల

‌తెలంగాణలో కొరోనా సెకండ్‌వేవ్‌ ‌లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ ‌విషయంలో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మొద్దనీ, అర్హులు రిజిస్ట్రేషన్‌ ‌చేసుకుని అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌లో కొరోనా వ్యాక్సిన్‌ ‌వేయించుకోవాలని కోరారు. రాష్ట్రంలో మూడో దశ కొరోనా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన హుజూరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానాలో వ్యాక్సిన్‌ ‌వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైగా వయసున్న దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కొరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

ఎంపిక చేసిన కొన్ని ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లో సైతం వ్యాక్సిన్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క డోస్‌కు రూ.250గా నిర్ణయించామనీ, అర్హులు రిజిస్ట్రేషన్‌ ‌చేసుకుని కేటాయించిన సమయం ప్రకారం వ్యాక్సిన్‌ ‌వేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి వ్కాక్సినేషన్‌ ‌వేయించడం జరిగిందనీ, రెండో దశలో ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్‌కు ఇచ్చామని వివరించారు. డీఎంలో కలెక్టర్‌తో కలసి వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని ప్రారంభించామనీ, క్రమక్రమంగా దీనిని విస్తరిస్తామని చెప్పారు. ప్రతీ వొక్కరికీ వ్యాక్సిన్‌ అం‌దుతుందనీ, తొందరపడకుండా అందరూ రిజిస్ట్రేషన్‌ ‌చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఈటల సూచించారు.

Leave a Reply