- ఏ పార్టీ అయినా వదలం
- 28న కెసిఆర్ సభకు తరలిరండి : మంత్రి కేటీఆర్
శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీవారు అయినా వొదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు.
గురువారం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని…ఎటువంటి కార్యక్రమాలు చేపట్టేది సభలో కేసీఆర్ చెబుతారని వెల్లడించారు. గ్రేటర్ ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభలకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తామన్నారు. వేల సంఖ్యలో ప్రజలు వొస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు.