- అంతర్గత భద్రతలో సవాళ్లు ఎదుర్కుంటున్నాం
- ఉగ్రవాద మూలాలను అణిచి వేస్తున్నాం
- శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీయే కీలకం
- ఐపిఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోమ్ మంత్రి అమిత్ షా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : దేశంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని అడ్డుకోవడంతో పాటు పీఎఫ్‌ఐ ఉగ్రవాద సంస్థను నిషేధించామని చెప్పారు. హైదబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడవి•లో 74వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరై ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ… శిక్షణ పొందిన ఐపీఎస్‌లకు అభినందనలు తెలియ జేశారు. ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి ఎన్నికవుతారని కానీ ఐపీఎస్‌లకు 30 నుంచి 35ఏళ్ల పాటు అధికారం ఉంటుందన్నారు. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళే ఉన్నారని.. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అమిత్ షా చెప్పారు. 8ఏళ్ల క్రితం దేశం అంతర్గత ఆందోళనలతో అట్టుడుకిందని.. కానీ నేడు ఆ పరిస్థితి లేదని అమిత్ షా అన్నారు. 7 దశాబ్దాలుగా అంతర్గత భద్రత రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నామని, ఈ పరిస్థితుల్లో 36 వేల మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమస్యలు ఉండేవని..అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానంపై పని చేశామమన్నారు. అదే విధంగా 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టామన్న షా.. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎస్‌లలో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారని…రానున్న రోజుల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
2005లో అర్ధిక వ్యవస్థలో 11 స్థానంలో ఉన్న దేశాన్ని 5 వ స్థానంలో నిలబెట్టామన్నారు. అతి త్వరలో 3వ స్థానానికి వొస్తుందని ఆశిస్తున్నామన్నారు. శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడికి 5 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఇస్తారని…కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల పాటు అధికారం ఉంటుందన్నారు. రాజ్యాంగం తమ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టిందని… ప్రతి ఐపీఎస్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని అమిత్ షా సూచించారు. 8 సంవత్సరాల క్రితం దేశ అంతర్గత భద్రత ఆందోళనకరంగా ఉండేదన్నారు. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో ఎన్నో సమాస్యలు ఉండేవని అన్నారు. అయితే అలాంటి సమస్యలను పూర్తిగా కట్టడి చేసినట్లు చెప్పారు. జమ్ము కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఉగ్రవాదాన్ని అదుపులో పెట్టామన్నారు. పీఎఫ్‌ఐ లాంటి సంస్థపై రాష్ట్రాల పోలీసులతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క రోజులోనే భరతం పట్టామని అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు. ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ లాంటి సంస్థల్ని విస్తృతపరుస్తున్నామని తెలిపారు.

37 మంది మహిళా ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. ఇప్పటికే 46 వారాల కఠోర శిక్షణ పూర్తి అయ్యింది. మొత్తం ఫీల్డ్ ట్రైనింగ్‌తో కలిపి 105 వారాల పాటు శిక్షణ పొందారు. ఇండోర్, ఔట్ డోర్ కలిపి 17 విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించారు. మరోవైపు ప్రతి ఏడాదికి మహిళా ఐపీఎస్‌లు పెరుగుతూ వొస్తున్నారు. ఈ బ్యాచ్‌లో అధికంగా ఇంజనేరింగ్, మెడికల్, సిఎ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ఐపీఎస్‌లను కేటాయించినట్లు అకాడవి• డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. తెలంగాణకు ఐదుగురు, ఏపీ కాడర్‌కు ఇద్దరు చొప్పున అధికారులను కేటాయించడం జరిగింది. హైదరాబాద్ వాసి శేషాద్రిరెడ్డిని తెలంగాణకు కేటాయించారు. అవినాష్ కుమార్, శేషాద్రిరెడ్డి, మహేష్ బాబా సాహెబ్, శంకేశ్వర్, శివం ఉపాద్యాయ తెలంగాణకు కేటాయించగా…ఏపీకి పంకజ్ కుమార్ వి•నా, అంకిత్ మహవీర్‌లను కేటాయించారు.