Take a fresh look at your lifestyle.

ఎపి నీటి వాటాలపై రాజీపడేది లేదు

శ్రీశైలంలో నిబంధనలకు విరుద్దంగా విద్యుత్‌ ఉత్పత్తి
తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ రాయాలని కేబినేట్‌ ‌తీర్మానం
డియా సమావేశంలో మంత్రులు ఆళ్ల నాని, అనిల్‌ ‌కుమార్‌
అమరావతి,జూన్‌ 30 : ఆం‌ధ్ర ప్రదేశ్‌, ‌తెలంగాణ జల వివాదంపై ఏపీ కేబినెట్‌ ‌దృష్టి సారించింది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా… శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్‌ ‌తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీ అయింది. కాగా కృష్ణా రివర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం విషయంలో యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నదని అభిప్రాయపడింది.

జలాశయంలో కనీస డ్రాయింగ్‌ ‌లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా మంత్రులతో భేటీలో సీఎం జగన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నానని చెప్పారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జగన్‌ ‌సూచించారు. విద్యుత్‌ ‌విషయంలో మరోసారి కేఆర్‌ఎం‌బీకి లేఖ రాయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే నిబంధనలకు లోబడే నీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ‌నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కేబినెట్‌ ‌భేటీ ముగిసిన అనంతరం మంత్రులు ఆళ్లనాని, అనిల్‌ ‌కుమార్‌ ‌డియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా… ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వ్యవహరిస్తున్న తీరును ఆయన విమర్శించారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నారు. 848 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు తీసుకోగలం.. తెలంగాణకు 800 అడుగులపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.. కృష్ణా బేసిన్‌లో 15 రోజులు మాత్రమే 880 అడుగులపైన నీటి లభ్యత ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇరిగేషన్‌ అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి. శ్రీశైలం డ్యామ్‌ ‌నిండకూడదనే దుర్మార్గమైన చర్య జరుగుతుందని తెలంగాణ తీరుపై మండిపడ్డారు. కేఆర్‌ఎం‌బీ ఆదేశాలు జారీ చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రి అనిల్‌ ‌కుమార్‌ ‌ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యవహారశైలిపై నేడే ప్రధాని మోదీకి, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నామన్న మంత్రి… రాష్ట్రప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణ చర్యలను అడ్డుకుని తీరుతాం. అవసరమైతే ప్రాజెక్ట్‌లను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. కాగా ఆంధప్రదేశ్‌- ‌తెలంగాణ జలవివాదంపై దృష్టి సారించిన ఏపీ కేబినెట్‌.. ‌రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసింది.

Leave a Reply