Take a fresh look at your lifestyle.

ప్రధాని ప్రసంగంలో స్పష్టమైన హామీ ఏమీ లేదు

ప్రధాని ప్రసంగం ఉంటుందంటే ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ప్రస్తావన లేదు.  ప్రపంచంలో కోవిడ్‌ ‌ని పారద్రోలడంలో భారత్‌ ‌నెంబర్‌ ‌వన్‌ ‌గా ఉందని  ఇంతకాలం గొప్పలు చెప్పుకున్నాం. మన చేతుల్లో లేని భూకంపం మాదిరి ఉపద్రవాన్ని సులభంగా దాటగలిగాం అని ప్రధాని నోట ఎన్నో సార్లు ప్రకటనలు వెలువడ్డాయి. కోవిడ్‌ ‌మొదటి దశను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని చెప్పారు.కానీ,ఏ విధంగా అయిందో ,ఎంతవరకు అయిందో చెప్పలేదు.అంత గట్టి విశ్వాసం దేశాధినేతకు
ఉండి ఉంటే మళ్ళీ రెండవ దశ ఎందుకు ప్రారంభమైందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో దేశ రాజధానిలోని ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తమ వద్ద ఆక్సిజన్‌ ‌నిల్వలు నిండుకున్నాయంటూ  తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వైద్య రంగానికి అవసరమైన ఆక్సిజన్‌ ‌నిల్వలు పుష్కలంగాదొరికేట్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. జరుగుతాయనే తప్ప చేసేశామన్న మాట ఆయన ప్రసంగంలో ఎక్కడా లేదు.

దేశంలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మృతుల సంఖ్య అధికార గణాంకాల కన్నా చాలా ఎక్కువ ఉంటోంది. దేశంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా రోగులతో కిక్కిరిసి పోతున్నాయి.  ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు లేవు, వెంటిలేటర్లు లేవు., ఆఖరికి ఆక్సిజన్‌ ‌సరఫరా కూడా  సంతృప్తికరంగా లేదు. ప్రాణరక్షణ మందులు  దొరకడం లేదు. దొరికినా అవి సామాన్యునికి అందుబాటులో ఉండటం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సన్యాసి వేషధారణలో టీవీల్లో కనిపిస్తున్నారు. అంటే తనకేమీ కోర్కెలు లేవనీ, తాను విరాగిననే భావం కలిగిస్తున్నారు. ఆయన ప్రజలకు గట్టి హామీ ఇవ్వడం లేదు. కోవిడ్‌ ‌రెండవ దశ ప్రారంభమైన తర్వాత ఆయన చేసిన తొలి ప్రసంగంలో  ఎటువంటి భరోసా ఇవ్వలేదు.ఆయన చేసిన ప్రసంగం సమయానుకూలమైనదే.

ఆయన నుంచి జనం  ఎంతో వినాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల దేశంలో మరణాల సంఖ్య అధికార గణాంకాల కన్నా చాలా ఎక్కువే. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేవు. వైద్య,ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలేట్టుగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు.  ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేవు, పడకలు లేవు, ఆక్సిజన్‌ ‌లేదు.,  కొరత లేనిదల్లా మృత దేహాలు. స్మశానాలన్నీ మృత దేహాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి.  ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ ‌ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ‌బాగా తగ్గిపోయింది. అంతటా కలవర పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ఇలాంటి సమయంలో దేశాధినేత ప్రసంగం ఎంతో భరోసా ఇస్తుందని ప్రజలు ఆశించారు. కానీ,ఆయన ప్రసంగం అందుకు భిన్నంగా ఉంది. ఆయన ప్రసంగంచాలా క్లుప్తంగా ఉంది . ప్రధాని నుంచి  నిర్దిష్టమైన హామీలు  ప్రజలు కోరుతున్నారు.  ఊకదంపుడు ప్రసంగాలు, ఊరడింపు మాటలు కావు.  కరోనా రెండవ దశలో  వైద్య సౌకర్యాల లేమి పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం నేరపూరితమైన నిర్లక్ష్యం పట్ల ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ఖర్మ అని బాధపడుతున్నారు.  ఈ సమయంలో ప్రజలకు కావల్సింది గంభీరోపన్యాసాలు కావు.  ఉపాఖ్యానాలు కావు.

ప్రసంగాలు దంచేయడంలో ప్రావీణ్యులు కారు.  ఇలాంటి సమయంలో తమను ఆదుకునే పాలకులు కావాలి.  స్పష్టమైన హామీలను ప్రజలు కోరుతున్నారు.కానీ, ప్రధాని ప్రసంగంలో అలాంటివేమీ లేవు. హావభావాలను ప్రదర్శిస్తూ ఎప్పటిమాదిరిగానే ఆయన ప్రసంగం సాగింది. అలాగే, తమను ఆశ్చర్య పర్చే ప్రకటన ఏదైనా ప్రధాని చేస్తారేమోనని ప్రజలు ఆశించారు.  అయితే, మరో సారి లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటిస్తున్నట్టు మాత్రం ప్రకటించలేదు. బహుశా ఆయన ప్రసంగంలో ఊరట నిచ్చే అంశం అదే. ఇందుకోసం రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకూ ప్రజలు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రధాని ప్రసంగం ఉంటుందంటే ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమోనని ఎదురు చూసిన వారికి నిరాశ ఎదురైంది. గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ప్రస్తావన లేదు.  ప్రపంచంలో కోవిడ్‌ ‌ని పారద్రోలడంలో భారత్‌ ‌నెంబర్‌ ‌వన్‌ ‌గా ఉందని  ఇంతకాలం గొప్పలు చెప్పుకున్నాం.

మన చేతుల్లో లేని భూకంపం మాదిరి ఉపద్రవాన్ని సులభంగా దాటగలిగాం అని ప్రధాని నోట ఎన్నో సార్లు ప్రకటనలు వెలువడ్డాయి. కోవిడ్‌ ‌మొదటి దశను నిర్మూలించడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని చెప్పారు.కానీ,ఏ విధంగా అయిందో ,ఎంతవరకు అయిందో చెప్పలేదు.అంత గట్టి విశ్వాసం దేశాధినేతకు ఉండి ఉంటే మళ్ళీ రెండవ దశ ఎందుకు ప్రారంభమైందన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో దేశ రాజధానిలోని ప్రధాన ఆస్పత్రుల సూపరింటెండెంట్లు తమ వద్ద ఆక్సిజన్‌ ‌నిల్వలు నిండుకున్నాయంటూ  తమ సమస్యలను ఏకరవు పెట్టారు. వైద్య రంగానికి అవసరమైన ఆక్సిజన్‌ ‌నిల్వలు పుష్కలంగా దొరికేట్టు ఏర్పాటు చేస్తామని ప్రధాని అన్నారు. అన్నీ కూడా జరుగుతున్నాయి.

జరుగుతాయనే తప్ప చేసేశామన్న మాట ఆయన ప్రసంగంలో ఎక్కడా లేదు. ప్రయాస్‌ ‌కియా జా రహాహై అని చెప్పారు.  అలాగే, ఆయన ప్రసంగంలో భవిష్యత్‌ ‌ప్రణాళిక విషయం కూడా లేదు. అయితే, ప్రజల్లో అన్ని వర్గాలకూ సూచనలు చేశారు.  మరో సారి వలస కార్మికులు భారీగా తరలి వెళ్ళే పరిస్థితి ఉంది.ఆ విషయంలో మాత్రం రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలంటూ సూచన చేశారు. మోడీ ప్రభుత్వం  అంటువ్యాధుల నివారణకు కేంద్ర చట్టం కింద రాష్ట్రాల అధికారాలను పక్కన పెట్టి తానే  అన్ని అధికారాలుతీసుకుంది. సహాయక సంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఆపన్నులను ఆదుకోవాలని ఆయన సూచించారు. సహాయక చర్యలు కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేశారు.  మీడియా ప్రజలను భయపెట్టేట్టు కాకుండా,వాస్తవాలను తెలియజేస్తూనే వారిలో ధైర్యం నింపే రీతిలో వార్తలు రాయాలని సూచించారు. కట్టుకథలు,ఊహాగానాలను ప్రచారం చేయొద్దని హిసవొసెగారు.

అదే సందర్భంలో ఎన్నికల ర్యాలీల్లో  నాయకులు ఎలా మసులుకోవాలో,ఎలాంటి ప్రసంగాలు చేయాలో తెలుసుకోవాలని ఆయన హితబోధ చేయడం మరిచిపోయారు. మోడీ ప్రభుత్వానికి కరోనాని ఎదుర్కోనేందుకు నిర్దిష్టమైన లక్ష్యాలు., స్పష్టమైన ప్రణాళిక లేదు.  బెంచ్‌ ‌మార్క్లు లోవు. ఆశయాలు లేవు.ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా పదికోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చిందని మాత్రం ఆయన ఘనంగా చెప్పుకున్నారు. అమెరికా 82 రోజుల్లో.పూర్తి చేస్తే భారత్‌ 84 ‌రోజుల్లో పూర్తి చేసింది. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో భారత్‌ ‌చాలా దేశాలకన్నా వెనకబడి ఉంది.

జాతినుద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏముంది.  టెలివిజన్‌ ‌చానల్లో టిఆర్పి  షోలా మిగిలిపోయింది. పదేళ్ళ నుంచి మోడీ ప్రసంగాలను శ్రద్ధగా వింటున్న మా స్నేహితుడు రాకేష్‌ ‌శర్మ అన్నదేమంటే ప్రాణ్‌ ‌జాయే పార్‌ ‌పిఆర్‌ ‌నజాయే అని అభివర్ణించారు.  ఆస్పత్రుల్లో, స్మశానాల్లో హృదయ విదారక దృశ్యాలను మరిపింపజేయడానికి ఆయన తన భాషా చాతుర్యాన్ని ప్రదర్శించారు.లడఖ్‌ ‌విషయంలో విజయం సాధించామనీ గొప్పగా చెప్పుకుంటున్న ప్రధాని దేశంలో మందుల బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయలేదు. మోడీకి ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో తెలుసు, కానీ, ఎలా పరిపాలన చేయాలో తెలియదు.

(ఈ వ్యాసంలో అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ట్రిబ్యూన్‌ ‌సౌజన్యం తో ..

Yogendra yadav
యోగేంద్రయాదవ్‌
‌నేషనల్‌ ‌ప్రెసిడెంట్‌, ‌స్వరాజ్‌ ఇం‌డియా

Leave a Reply