Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో రెడ్‌జోన్‌లు లేవు…ఆర్థిక మంత్రి ఈటల

భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఈ మహమ్మారిని కుటుంబ సభ్యులకు అంటగట్టారన్నారు. గచ్చిబౌలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ గాలితో వచ్చే రోగం కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో వస్తోంది.

ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఒక్క బాధితుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. అనవసర సమాచారంతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. ’’ అని వివరించారు.

Leave a Reply