Take a fresh look at your lifestyle.

నగరంలో ఎక్కడా రెడ్‌జోన్లు లేవు

  • వదంతులను నమ్మొద్దు
  • స్పష్టం చేసిన సైబరాబాద్‌ ‌సిపి సజ్జన్నార్‌

నగరంలో ఎక్కడా రెడ్‌ ‌జోన్‌లు లేవు అని సైబరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌స్పష్టం చేశారు. చందానగర్‌, ‌ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. అయితే కొందరు దఫదఫాలుగా కుటుంబ సభ్యులతో బయటకు వస్తున్నారు. అలాంటి వారి వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు. చందానగర్‌, ‌గచ్చిబౌలి, తుర్కయాంజల్‌, ‌కొత్తపేటను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. చందానగర్‌ ‌రెడ్‌జోన్‌గా ప్రకటించారు అనే ప్రచారాన్ని చందానగర్‌ ‌సర్కిల్‌ 21 ‌డిప్యూటీ కమిషనర్‌ ‌సుధాంశ్‌ ‌నందగిరి, చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌రవిందర్‌లు ఖండించారు. రెడ్‌జోన్ల పై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. చందానగర్‌ ‌సర్కిల్‌ 21 ‌పరిధిలో ఇప్పటివరకు 2 పాజిటీవ్‌ ‌కేసులు మాత్రమే నమోదయ్యాయని, పలువురు
క్వారెంటైన్‌ ‌లో ఉన్నారని అన్నారు. అనవసర ప్రచారాలను నమ్మి ప్రజలు భయాందోళనకు గురవ్వొద్దని డీసి తెలిపారు. ఐతే ఇళ్లలోంచి మాత్రం ఎవరు బయటకు రావద్ధని, తప్పని పరిస్థితుల్లో రావలసి వస్తే ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు.

రెడ్‌ ‌జోన్లు లేవన్న జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌
‌గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కమిషన్‌ ‌పరిధిలో రెడ్‌ ‌జోన్లు లేవని జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ‌లోకేశ్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. చందానగర్‌, ‌ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ప్రచారం అవస్తవమన్నారు. హైదరాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌శ్వేతా మహంతి మాట్లాడుతూ.. రెడ్‌ ‌జోన్‌ ఉన్నట్లు మార్ఫింగ్‌ ‌చేసిన ప్లెక్సీలు పెడుతున్నారన్నారు. హైదరాబాద్‌ ‌జిల్లాలో రెడ్‌ ‌జోన్‌ ఎక్కడా ప్రకటించలేదన్నారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.  సైబరాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌డియాతో మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడా రెడ్‌ ‌జోన్‌లు లేవని స్పష్టం చేశారు. చందానగర్‌, ‌ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. అయితే కొందరు దఫదఫాలుగా కుటుంబ సభ్యులతో బయటకు వస్తున్నారు. అలాంటి వారి వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!