రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వం దగ్గర డేటా లేదని కేంద్ర •ంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమా ధానంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రైతు ఆత్మహత్యలపై డేటాను సేకరించడాన్ని రాష్ట్ర ప్రభు త్వాలే నిలిపివేశాయన్నారు. రైతులు ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ కైమ్్ర రికార్డస్ బ్యూరో ఎన్సీఆర్బీ వద్ద డేటా లేదన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ.. గత అయిదేళ్లలో ఎన్ఎస్ఏ..ఢిల్లీలో ఒక్క కేసును కూడా రిజిస్టర్ చేయలేదన్నారు.
నేషనల్ సెక్యూర్టీ యాక్ట్‌ను రద్దు చేసే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావానికి లోనయ్యాయని, 2019లో 61 జిల్లాలో తీవ్రవాద ఘటనలు జరిగాయని, 2020 తొలి అర్థభాగంలో 46 జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు మంత్రి రెడ్డి వెల్లడించారు. సరిహద్దుల వద్ద రక్షణ బలోపేతానికి బహుళ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నట్లు కేంద్ర •ంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. సరిహద్దుల్లో మౌళిక సదుపాయాల కల్పన, అంతర్జాతీయ బోర్డర్ వద్ద గస్తీ దళాల పెంపునకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరో ప్రశ్నకు బదులుగాగత మూడేళ్లలో 2120 మంది పాకిస్తానీలకు, 188 మంది ఆఫ్ఘన్ జాతీయులకు, 99 మంది బంగ్లాదేశీయులకు భారతీయ పౌరసత్వం ఇచ్చినట్లు మంత్రి రాయ్ తెలిపారు.